శ్రీ సాయి నీళ్లతో దీపాలను వెలిగించుట

Lighting the lamps with Sri Sai water

Advertisements

&NewLine;<p>గోదావరీ నిదీ పరీవాహక ప్రాంతమైన అహమద్ నగర్ జిల్లాలో ఒక కుగ్రామమైన శిరిడీలో ఒక పాడుబడ్ద మశీదులో స్థిర నివాసమేర్పరుచుకున్న శ్రీ సాయిబాబా నిత్యం తన మశిదులో రాత్రిళ్ళు దీపాలను వెలిగించే వారు&period; దీపాలని వెలిగించేందుకు అవసరమయిన నూనెను ఆ ఊరులోని షాహుకార్ల వద్ద నుండి యాచించి తెచ్చేవారు&period;మానవుని హృదయంలో జన్మాంతరాలుగా పేరుకొనిపోయి వున్న అజ్ఞానపు చీకట్లను పటాపంచలు చేసి&comma; వారికి సన్మార్గం చూపేందుకే ఈ దీపాలను వెలిగిస్తున్నానని శ్రీ సాయి తన భక్తులతో తరచుగా చెప్పేవారు&period; ఆ గ్రామంలో బాలా భాటే అనే ఒక ఆసామికి శ్రీ సాయి యొక్క పద్ధతులు నచ్చేవి కావు&comma; శ్రీ సాయి ఒక పిచ్చి ఫకీరని&comma; చిన్నపాటి క్షుద్ర విద్యలను నేర్చుకొని ప్రజలను మోసం చేస్తున్నాడని భాటే ఆ ఊరి ప్రజలకు చేప్పేవాడు&period; పైగా మహ్మదీయుడైన సాయి మశీదులో హిందువుల ఆచార పద్ధతిలో దీపాలను వెలిగించడం హిందువుల మత విశ్వాసాలను మంటగలపడమేనని అందరినీ రెచ్చగొట్టసాగాడు&period; భాటే మాటలను నమ్మినా ఆ ఊరి వర్తకులు ఒకసారి కూడబలుక్కొని శ్రీ సాయికి నూనెను ఇవ్వరాదని నిశ్చయించుకున్నారు&period; ఆ సాయంత్రం సాయి నూనె కోసం యాచనకు వెళ్ళినప్పుడు వర్తకులందారూ మెము నూనెను ఇవ్వమని ఖచ్చితంగా చెప్పేసారు&period; శ్రీ సాయి ఇంకెమి బదులివ్వక&comma; &&num;8216&semi;అల్లా అచ్చా కరెగా&&num;8221&semi; అని వారిని ఆశీర్వదించి ఖాలీ చేతులతో మశీదుకు తిరిగి వెళిపోయారు&period; ఆ రాత్రి ఆ పిచ్చి ఫకీరు ఇక దీపాలను ఎలా వెలిగిస్తాడో చూద్దామని భాటేతొ కలిసి వర్తకులందరూ మశిదుకు వెళ్ళి దూరంగా దాక్కోని జరిగే తతంగాన్నంతటినీ వేడుకగా చూడసాగారు&period; రాత్రి అయ్యాక&comma; శ్రీ సాయి కొద్దిపాటి నూనె చుక్కలున్న ఆ తంబిరేలు డబ్బాలో నీళ్ళను పోసి&comma; ఆ నీటినంతటినీ తాగేసి తిరిగి ఆ డబ్బాలోకి వొంపేసారు&period; ఈ విధంగా నూనె చుక్కలతో కలిసిన ఆ నీళ్లను తన నోటితో పావనం చేసాక ఆ నీటిని ప్రమిదలలో పోసి వెలిగించగా ఆశ్చర్యాలలో కెల్లా ఆశ్చర్యంగా ప్రమిదలన్నీ మరింత ఎక్కువ కాంతితో తెల్లవార్లూ అద్భుతంగా వెలిగాయి&period; ఈ వింతను చూసిన ఆ వర్తకుల అజ్ఞానం నశించింది&period; శ్రీ సాయి సామాన్యుడు కాదని&comma; ఒక గొప్ప యోగియని వారికి అప్పుడు అవగతం అయ్యింది&period; శ్రీ సాయి సాక్షాత్ భగవత్స్వరూపుడు కాకపోతే తన శక్తితో నీళ్ళను నూనెగా మార్చివెయగలుగుతారా &quest; సాధారణ యోగులకు ఇది సాధ్యమా &quest;పశ్చాతాపంతో వర్తకులందారూ శ్రీ సాయి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు&period; దయామయుడైన సాయి ఆ వర్తకులను క్షమించి అప్పుడు ఒక అపూర్వమైన బోధ చేసారు&&num;8221&semi; నాయనలారా &excl; అసత్యమంటే ఆ భగవంతునికి గిట్టదు&period; ఎల్లఫ్ఫుడూ సత్యాన్నే అంటి పెట్టుకొని వుంటే అది మనల్ని తప్పక రక్షిస్తుంది&period;ఇతరులను బాధ పెట్టి వేడుక చూడాలని ఎన్నడూ ప్రయత్నించవద్దు&period; ఇతరులకు పంచి ఇచ్చిన ఐశ్వర్యం వంద రెట్లు అయ్యి తిరిగి వచ్చినట్లే ఇతరులను మనము పెట్టి బాధలు వెయ్యింతలై మన వద్దకే తిరిగి వస్తాయి&period; ఎన్నడూ చెప్పుడు మాటలను విన్నవద్దు&period; అవి మనల్ని అధోగతి పాలు చేస్తాయి&comma; మనకు ఏం కావాలన్నా&comma; ఏం తెలుసుకోవాలన్నా ఆ భవవంతుడినే అడిగి తెలుసుకోవాలి&&num;8221&semi; పరిశుద్ధ పరబ్రహ్మ అవతారమైన శ్రీ సాయినాధుని అమృత పలుకులను మనసారా వంటపట్టించుకున్న ఆ వర్తకులందరూ సాయి ఆశీర్వాదములను తీసుకొని సంతోషంగా తమ తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం.

కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త.