85
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ అయ్యాయి. అలాగే మాంసం దుకాణాలు కూడా మూతపడ్డాయి. జనవరి 26న నేషనల్ డ్రై డే కావడంతో దేశవ్యాప్తంగా వైన్స్ షాపులు, బార్లు, పబ్స్ సైతం మూసివేశారు. తెలంగాణలో వైన్స్ షాపులు, బార్లు మూసి వేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొంది.