ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద గల మిషన్ భగీరథ పంప్ హౌస్ ను పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పరిశీలించారు. పాలేరు రిజర్వాయర్ అడుగంటడం తో ఇటీవల నాగార్జున సాగర్ నుంచి పాలేరు జలాశయానికి అధికారులు నీటిని విడుదల చేశారు. పాలేరు నుంచే సూర్యాపేట, మహబూబ్ బాద్, ఉమ్మడి ఖమ్మం, జిల్లాలకు త్రాగునీటిని అందిస్తున్నారు. ఈ క్రమంలో రిజర్వాయర్ లో తగినంత నీరు లేకపోవడంతో త్రాగునీటి కోసం సాగర్ జలాలతో నింపారు. మరో వైపు పాలేరు పాత కాలువ కింద పంటలు సాగు చేసిన రైతులు సాగునీరు ఇవ్వాలని పలుమార్లు అధికారులను కోరారు. దీంతో పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పాలేరు రిజర్వాయర్ వద్ద ఉన్న మిషన్ భగీరథ పంప్ హౌజ్ ను పరిశీలించి, అనంతరం జీళ్ళ చెరువు లో అధికారుల తో త్రాగునీటి పై సమావేశం ఏర్పాటు చేశారు. వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. సాగర్ జలాశయం లో నీరు తక్కువగా ఉండటం తో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఆయన అన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.