ఆర్టీసీలో కారుణ్య నియామకం చేయండి – యువకుని ఆవేదన

ts rtc

Advertisements

&NewLine;<p>ఆర్టీసీలో కారుణ్య నియామకం కోసం పది సంవత్సరాల నుంచి తిరుగుతున్న పట్టించుకోవడం లేదని ఓ యువకుడు దుబాయ్ నుండి మాట్లాడిన వీడియో లో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు&period; తాను మాట్లాడుతూ రికార్డ్ చేసిన వీడియోను పంపాడు&period; జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ కు చెందిన రాగుల వెంకటేష్ తండ్రి మల్లయ్య జగిత్యాల ఆర్టీసీ డిపోలో పని చేసేవాడు&period; అప్పట్లో బస్సు రిపేర్ చేస్తుండగా బలమైన రాడ్డు కాళ్లపై పడి తీవ్ర గాయాలయ్యాయి&period; అప్పటి నుండి మెట్పల్లి&comma; మంథని డిపోల్లో కొనసాగుతూ ఉన్నాడు&period; మంథని డిపో మేనేజర్ సూచన మేరకు కరీంనగర్ లో వైద్య పరీక్షల కోసం వెళ్లగా నీవు ఉద్యోగం చేయడానికి పనికి రావని వైద్యులు తేల్చి చెప్పారు&period; ఈ లోగా కాలి గాయం విషమయంగా మారి మల్లయ్య మృతి చెందాడు&period; అయితే మల్లయ్య కుమారుడు వెంకటేష్ ఆర్టీసీ లో కారుణ్య నియామకం కోసం 10 సంవత్సరాల నుండి ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళాడు&period; రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇప్పటికైనా తనకు ఆర్టీసీలో కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పించాలని దుబాయ్ నుండి వెంకటేష్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…

ట్రంప్‌ను టార్గెట్ నిందితుడి వీడియో వైరల్..

మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం..