96
హీరోయిన్ త్రిషపై తమిళ సినీ నటుడు చేసిన రేప్ వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ‘లియో’ సినిమాలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని తాను భావించానని అయితే అలాంటి సన్నివేశం సినిమాలో లేకపోవడంతో తాను చాలా డిజప్పాయింట్ అయ్యానని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. చిరంజీవి, ఖుష్బూ కూడా ఈ వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో చిరంజీవి, త్రిష, ఖుష్బూలు తన పరువుకు భంగం కలిగేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వీరిపై పరువునష్టం దావా వేశారు. మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను అనని మాటల గురించి అనవసరంగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, వీరి వ్యాఖ్యల వల్ల సమాజంలో తన పరువుకు భంగం కలిగిందని పిటిషన్ లో పేర్కొన్నారు.