సీఆర్పీఎఫ్‌ కోబ్రా బలగాలపై మావోయిస్టుల మెరుపుదాడి…

Maoist ambush on CRPF Cobra forces...

Advertisements

&NewLine;<p>ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా-బీజాపూర్‌ జిల్లాల సరిహద్దుల్లో సీఆర్పీఎఫ్‌ కోబ్రా బలగాలపై మావోయిస్టుల మెరుపుదాడి ఘటనలో విస్మయం కలిగించే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి&period; టేకులగూడెం అటవీప్రాంతంలోని సీఆర్‌పీఎఫ్‌ బేస్‌క్యాంపు సమీపంలో మూడు రోజుల క్రితం భద్రతబలగాలపై చేసిన దాడిలో మావోయిస్టులు బ్యారెల్‌ గ్రెనేడ్‌ లాంచర్లను వినియోగించారు&period; అయితే వాటిని సొంతంగానే తయారు చేస్తున్నట్లు తేలడం ఆందోళన కలిగించే అంశంగా మారింది&period; బీజీఎల్‌తోపాటు ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌లను సొంతంగానే కర్మాగారాల్లో తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు&period; టేకులగూడెం అడవుల్లో దాడి అనంతరం మావోయిస్టుల సొరంగాన్ని పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే&period; ఆ ప్రాంతానికి సమీపంలోనే భారీగా ఆయుధాల డంప్‌ను భద్రతబలగాలు స్వాధీనం చేసుకోగా వీటిలో పదుల సంఖ్యలో బీజీఎల్‌లు లభించడం గమనార్హం&period; వాటి నిర్మాణశైలిని బట్టి మావోయిస్టులు సొంతంగానే తయారు చేస్తున్నట్లు గుర్తించారు&period; దండకారణ్యంలోని అబూజ్‌మడ్‌ అడవుల్లో వీటిని తయారు చేస్తున్నట్లు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..