123
నెల్లూరు జిల్లా(Nellore) సంగం గ్రామంలోని పలు కాలేజీల్లో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది. కృష్ణార్జున రెడ్డి బిఈడి కాలేజ్, శ్రీ నేతాజీ డిగ్రీ కళాశాలలో.. ఓపెన్ డిగ్రీ పరీక్షల్లో మాస్కాపింగ్ జరిగింది. దీంతో కాలేజీల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. అబ్జర్వర్ లోపల ఉండీ కూడా పరీక్షలు నిర్వహించడం ఏంటని యాజమాన్యన్ని నిలదీశారు. మాస్ కాపీయింగ్ ను ప్రశ్నించినందుకు కరస్పాండెంట్ దాడి చేశారంటూ విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. జిల్లా ఉన్నత అధికారులు వెంటనే స్పందించి.. పరీక్షలు రద్దుచేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.