టీడీపీలోకి భారీ చేరికలు…

Massive additions to TDP...

Advertisements

&NewLine;<p>రాయదుర్గం నియోజకవర్గంలోని డి హీరేహాల్ మండలం పాత హడగలి గ్రామంలో తెదేపా పోలిట్ సభ్యులు మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వైస్ సర్పంచ్ హనుమంతుతో పాటు&comma; 30 కుటుంబాలు సోమవారం వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి&period; వైకాపా నాయకులకు కాలవ శ్రీనివాసులు తెదేపా కండువాలు కప్పి తమ పార్టీలోకి ఘన స్వాగతం పలికారు&period; ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు&period; పాత హడగలి గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీలోకి రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు&period; భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకుంటుందని &comma; తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు&period; రాష్ట్రంలో వైకాపా పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు&comma; ప్రజా ప్రతినిధులు&comma; అధికారులు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని కాలవ శ్రీనివాసులు ఈ సందర్భంగా వివరించారు&period; ఈ కార్యక్రమంలో డి హీరే హాల్ మండల తెదేపా కన్వీనర్ హనుమంత రెడ్డి&comma; తెదేపా సీనియర్ నాయకులు కాదలూరు మోహన్ రెడ్డి&comma; తెదేపా ఎంపీటీసీలు మొండి మల్లికార్జున&comma; మురడి గంగాధర&comma; మండల తెదేపా నాయకులు&comma; గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..