కృష్ణాజిల్లా మచిలీపట్నం, స్థానిక రాజుపేటలో శుక్రవారం పట్టపగలు భారీ చోరీ జరిగింది. రూ.5 లక్షలతో పాటు 100 కాసుల బంగారం అపహరణకు గురైంది. ఇనగుదురుపేట పోలీసు స్టేషన్ పరిధిలో రాజుపేటకు చెందిన ధాన్యం, బియ్యం వ్యాపారి పద్మనాభుని చిననాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం ఇంటికి తాళాలు వేసి విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు, తిరిగి రాత్రి ఇంటికి వచ్చి చూడగా, ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లోని బీరువా పగులగొట్టినట్టు ఉండటంతో చిననాగేశ్వరరావు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శుభకార్యం ఉండటంతో బ్యాంక్ లాకరులో ఉన్న నగలను ఇటీవలే ఇంటికి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని ఇనగుదురుపేట సీఐ ఉమామహేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పరిశీలించారు. ఎంతమేర నగలు, నగదు దొంగతనం జరిగిందనే అంశంపై వివరాలు సేకరిస్తున్నామని, వేలిముద్రలు సేకరిస్తున్నామని సీఐ తెలిపారు.
Read Also..