కలిచర్ల లో కడప అమీన్ పీర్ పెద్ద దర్గా పీఠాధిపతి మరియు ప్రెసిడెంట్ మౌలా కా పహాడ్ వెల్ఫేర్ సొసైటీ హజరత్ క్వాజా సయ్యద్ షా అరిఫుల్ల మహమ్మద్ మహమ్మదుల్ హుస్సేనీ చిష్టి ఉల్ ఖాద్రీ ఆధ్వర్యంలో గంధమహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి ప్రముఖ కంటి వైద్య నిపుణులు శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి నుంచి ప్రముఖ వైద్యులచే మెడికల్ క్యాంపు నిర్వహించారు. చుట్టుపక్క గ్రామాల నుండి పేద్ద ఎత్తున పేద ప్రజలు మెడికల్ క్యాంపుకు హాజరయ్యారు. విచ్చేసిన ప్రజలకు అత్యాధునిక పరికరాలతో సుమారు 1000 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు మందులు పంపిణీ చేసారు. శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి వారు మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో కొందరికి చికిత్సలు అందించి మరికొందరికి ఆపరేషన్ అవసరం అవడంతో తమ ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రత్యేక చికిత్సలు చేయడం జరుగుతుందని డాక్టర్ మహేష్, డాక్టర్ నవ కాంత్, డాక్టర్ ఆకాష్ తెలిపారు.
ఈ సందర్భంగా కలిచెర్ల దర్గా మేనేజర్ మొహ్మద్ అలిఖాన్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక ప్రతిష్టను ఇక్కడ నెలకొల్పడానికి ఈ మౌలాకా పహాడ్ నందు ప్రతి ఏటా జనవరి ప్రిబవరి నెలలో గంధమహోత్సవం ఉరుసు మహోత్సవం నిర్వహిస్తుంటారు. పీఠాధిపతి గారి ఆజ్ఞానుసారం ఇక్కడ గంధమహోత్సవం అనేది నిర్వహించబడుతుంది. పీఠాధిపతి గారి ఆధ్వర్యంలో ఈ శుభ సందర్భంగా పీఠాధిపతి గారు అరవింద్ కంటి ఆసుపత్రి హాస్పిటల్ తిరుపతి వారిచే ఇక్కడ ఒక మెగా కంటి ఉచిత వైద్య శిబిరాన్ని ఇక్కడ నెలకొల్పడం జరిగిందని ఈ శిబిరంలో విచ్చేసినటువంటి వ్యాధిగ్రస్తులకు ఉచిత మెడిసిన్ మరియు ఉచిత అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుందని వారికి ఉచిత భోజన సదుపాయం కల్పించడం జరిగిందని సాయంత్రం అరు గంటలకు గందమహోత్సవం జరుగుతుంది. ఎనిమిది గంటలకు ప్రముఖ సూఫీ కవ్వాల్ ఇండియన్ ఐడల్ బెస్ట్ సింగర్ దానిష్ ఖాన్ గారిచే ఖవ్వాలి నిర్వహించబడుతుందని తెలిపారు.