సనత్ నగర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బన్సీలాల్ పేట్ డివిజన్ బోయగూడా ప్రాంతంలో ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని మైనార్టీ సోదరులు ఈ సమావేశం ద్వారా ఏకగ్రీవ తీర్మానం చేశారు. నిత్యం ప్రజలతో ఉంటూ అవసరం వచ్చిన శుభకార్యానికి అండగా నిలిచే వ్యక్తి తలసాని శ్రీనివాస్ యాదవ్ అని 450 కోట్లతో సనత్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్ర స్థానంలో నిలిపారని వారు అన్నారు. మేనిఫెస్టోకు సంబంధం లేకుండా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ అని కుల, మతవరణలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలిచిందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే తెల్ల బట్టలు వేసుకొని కనబడే వ్యక్తులు ప్రజలలో ఎప్పటికీ ఉండాలని స్థానిక ప్రతిపక్ష పార్టీల్లో బలమైన నాయకులు లేకనే ఢిల్లీ నుండి వచ్చి ఇక్కడ ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిపై కేసీఆర్ పై నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ గడ్డపై ప్రతి ఒక్కరిలో ప్రవహించే రక్తం పోరాటాల స్ఫూర్తితో ఉంటుందని వారు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోయే ప్రజలు ఈ ప్రాంతంలో ఎవరూ లేరని ఎన్ని ప్రలోభాలుకు గురిచేసిన భయపెట్టిన భయపడే వాళ్ళు ఎవరు లేరని ధీమా వ్యక్తం చేశారు. స్థానికులు కాని వారు ఇక్కడికి వచ్చి పోటీ చేయడం, ఇక్కడి మనిషైనా గతంలో ఎమ్మెల్యేగా ఉన్న బిజెపి పార్టీ అభ్యర్థి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో లేడని వారితో నాకు పోటీ ఏంటి అని ఎద్దేవా చేశారు. కచ్చితంగా సనత్ నగర్ నియోజకవర్గం లో లక్ష మెజార్టీతో తన గెలుపు ఖాయమని అన్నారు.
తలసాని మైనార్టీల తో సమావేశం..
92
previous post