పల్నాడు(Palnadu) జిల్లా, ముప్పాళ్ళ మండలం లంకెలకూరపాడు గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. రూ.36 లక్షలతో ఆరోగ్య ఉప కేంద్రం, 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించిన రూ.43.90 లక్షల గోదాములను, శిలాఫలకాలను ఆవిష్కరించిన మంత్రి అంబటి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భం గా మంత్రి అంబటి మాట్లాడుతూ…
పార్టీలు మారిన విశ్వాస ఘాతకులను ఓడించండి. జగనన్నకు విధేయులను ఆశీర్వదించండి. జగనన్న నొక్కే సంక్షేమ బటన్ కు వివక్షత లేదు. పొదుపు సభ్యులకు ఆసరా చెల్లించే ఎన్నికలకు వెళ్తాం. కులాలు, వర్గాలు రాజకీయాలకు అతీతంగా పారదర్శక సంక్షేమ పాలన అందించాము. సత్తెనపల్లిలో నాపై, నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ లపై పోటీ చేస్తున్న వాళ్లు స్వార్థంతో పార్టీలు మారారు. విశ్వాసఘాతుకులను వారిని గెలిపించడం ధర్మమేనా?జగనన్నకు విధేయులుగా ఉన్న మమ్మల్ని ఆశీర్వదించాలి.
ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే- అంబటి(Ambati Rambabu)
గత ఎన్నికల హాయంలో చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలను ఇచ్చి డ్వాక్రా, రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేసారు. 48 నెలలుగా జగనన్న అందిస్తున్న సంక్షేమ పరిపాలనను గతంలో చంద్రబాబునాయుడు చేసిన పరిపాలనకు బేరీజు వేసుకొని ఆశీర్వదించాలి. లంకెలకూరపాడు గ్రామంలో గత ఎన్నికల్లో 1100 పైగా మెజార్టీ వచ్చిందని ఈసారి అంతకు మించిన మెజార్టీ రావాలి. ఇది వైఎస్ఆర్ సీపీకి కంచుకోటని నాయకులు సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించాలి అని తెలిపారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి