పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం నార్నేపాడు వీఆర్వో మల్లిఖార్జున్ రావు మిస్టరీ పోలీసులకు సవాల్ గా మారింది. ఆర్థిక బాధలు, ఇష్టం లేని వివాహం వంటి కారణాలతో ఇంటి నుండి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మల్లికార్జున రావు స్వగ్రామం ముప్పాళ్ళ మండలం పలుదేవర్లపాడు. సెప్టెంబర్ నెల 30వ తారీకున ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రెండు నెలల క్రితం వీఆర్వో కు సమీప బంధువుల అమ్మాయితో వివాహం జరిపించారు. ఇష్టం లేని పెళ్లితో మనస్తాపం చెంది సూసైడ్ నోట్ రాసి ఇంటి నుండి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు శ్రీశైలం మరియు మరికొన్ని పుణ్యక్షేత్రాలలో వీఆర్వో మల్లికార్జున రావు కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తమ బిడ్డ ఏమైపోయాడోనని కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పూణేలో కూలిన శిక్షణ విమానం..మహారాష్ట్ర పుణే జిల్లా బారామతిలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణకు ఉపయోగించే ఓ విమానం సాంకేతికలోపంతో కూలిపోయింది. ఈ ఘటనలో ట్రైనీ పైలట్‌కు గాయాలయ్యాయి. రెడ్‌బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన విమానం శిక్షణ కార్యక్రమంలో ఉండగా అందులో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో…
- సోనియాగాంధీకి మరోసారి అస్వస్థత…కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురుగ్రామ్‌లోని వేదాంత ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సోనియాగాంధీ ఆరోగ్యంనిలకడగా ఉందని వెల్లడించారు వైద్యులు. ఆమె వెంట కుమార్తె ప్రియాంక, కుమారుడు రాహుల్ గాంధీ ఉన్నారు. ఇటీవల…
- విజయ్ కు 144 మంది సభ్యుల మద్దతు..తమిళనాడు అసెంబ్లీలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. గంటల తరబడి సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వం బలపరీక్షలో ఘన విజయం సాధించింది. ప్రతిపక్షాల వ్యూహాలను చిత్తు చేస్తూ, ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ…
- Gujarat Titans ఘన విజయం.. Sunrisers Hyderabad 86 పరుగులకే కుప్పకూలింది..Sunrisers Hyderabad 169 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఘోరమైన బ్యాటింగ్ పతనాన్ని ఎదుర్కొంది. చివరకు 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభమే విపత్తుగా మారింది. Mohammed Siraj వేసిన తొలి ఓవర్లోనే Travis…
- యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో కబేళాలకు తరలిస్తున్న ఆవుల పట్టివేత…యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అక్రమంగా కబేళాలకు తరలిస్తున్న ఆవులను పట్టుకున్నారు పోలీసులు. రాజమండ్రి నుంచి బహదూర్‌పురా కబేళాకు తరలిస్తుండగా పట్టుకున్నారు. పైన సిమెంట్ బ్రిక్స్‌ను అమర్చి కిందిభాగంలో ఏర్పాటుచేసిన బాక్సుల్లో ఆవులను తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న బజరంగ్దళ్ కార్యకర్తలు పోలీసులకు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 74835