Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Andhra PradeshGuntur యరపతినేని శ్రీనివాసరావు మేనిఫెస్టో ప్రెస్ మీట్..

యరపతినేని శ్రీనివాసరావు మేనిఫెస్టో ప్రెస్ మీట్..

by Rama
yarapathineni srinivas

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మేనిఫెస్టో ప్రెస్ మీట్ నిర్వహించిన యరపతినేని శ్రీనివాసరావు (Yarapathineni Srinivasarao) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు కూడా న్యాయం జరిగేలా తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తయారు చేశారని కొనియాడారు. 200 వందల రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేసింది కూడా చంద్రబాబు నాయుడేనని 2019 ఎలక్షన్ కు ముందు పెన్షన్ 3000 చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ కు 3000 పెన్షన్ చేయడానికీ సంవత్సరానికి ₹250 చొప్పున ఐదు సంవత్సరాలు పట్టిందని అన్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

అలాగే 2024 ఎలక్షన్ మేనిఫెస్టో హామీలో కూడా 3000 పెన్షన్ దశలవారీగా 3500 చేస్తానని జగన్ అన్నారని అంటే రెండు సంవత్సరాలు రెండు వందల యాభై రూపాయలు చొప్పున అధికారంలోకి వస్తే ఇంకో ఐదు సంవత్సరాలు పడుతుంది జగన్ నీకు 3500 పెన్షన్ చేయడానికి అని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే 3000 పెన్షన్ ను ఏప్రిల్ నెల నుంచి 3500 ఇస్తామని అన్నారు. వ్యవస్థలను కుటుంబ సభ్యులను గౌరవించని జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఏం గౌరవిస్తారని అన్నారు. జూన్ 4 తర్వాత జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ ఇంటికి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.
    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం…
  • ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.
    ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…
  • మెగా డీఎస్సీపై జగన్‌కు లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్.
    మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ఆరోపణలకు మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీ…
Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: