క్రిస్టియన్ సోదరి, సోదరీమణులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చ్ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 23 ఏళ్లుగా క్రమం తప్పకుండా డిసెంబర్ 25న సిద్దిపేట చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నానన్నారు. సిద్ధిపేట చర్చ్ లో నిర్మాణంతో పాటు, ఏ సమస్యలు ఉన్నా ఒక్క అన్న, తమ్ముడిలా అండగా ఉంటానని ఆయన తెలిపారు. ప్రేమ భావాన్ని, క్షమా గుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజున్నారు. ఈ పర్వదినం క్రిస్టియన్ సోదరుల అందరికి శుభం చేకూరాలని ఆ ఏసు ప్రభును ఆయన ప్రార్థించానన్నారు. కుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాన్నారు. చర్చ్ ప్రాంగణంలో ఒక అద్భుతమైన కన్వేన్షన్ హాల్ నిర్మాణం చేసుకుందామని. అందుకు పూర్తి సహాయ సహకారం అందిస్తానని తెలిపారు.
ప్రజలకు మంత్రి హరీష్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు
70
previous post