79
పెటెక్స్ ఇండియా ప్రదర్శన హైదరాబాద్ కే గర్వకారణమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. భారతదేశంలోని పెంపుడు జంతువుల సంరక్షణపై ఈ ప్రదర్శనతో సంపూర్ణ అవగాహన కలుగుతుందన్నారు. హైటెక్స్ లో ఏర్పాటు చేసిన పెటెక్స్ ఎగ్జిబిషన్ ను తెలంగాణ పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. సీవీఆర్ న్యూస్ తో ఆయన మాట్లాడారు. మూడు రోజులపాటు ప్రదర్శన ఉంటుందన్నారు. దేశంలో పెంపుడు జంతువుల దత్తత రోజురోజుకూ పెరుగుతోందన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో హైదరాబాద్ పర్యాటకానికి ఊపు వస్తుందన్నారు.