అవుటర్ రింగ్‌రోడ్డు అవతల నుంచి నిర్మించే ప్రాంతీయ రింగ్‌రోడ్డు – ఆర్ఆర్ఆర్ ను మూడేళ్లలో పూర్తిచేస్తామని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ రాష్ట్రానికి సూపర్ గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. రహదారి మంజూరై నాలుగేళ్లయినా గత ప్రభుత్వ అసమర్థత కారణంగా ముందుకు సాగలేదని విమర్శించారు. పనులు ప్రారంభించిన నాటినుంచి మూడేళ్లలో పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతామన్నారు.
కొన్ని గంటల్లో చిలకలగుట్ట నుండి సమ్మక్క రాక
భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దక్షిణ భాగానికి కూడా త్వరలో జాతీయ రహదారి నంబరు కేటాయించేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. ఆర్ఆర్ఆర్ వేగంగా చేపట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఆ రహదారి చుట్టూ రింగ్‌రైలు ప్రాజెక్టుతోపాటు ఫార్మా, ఐటీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని కోమటి రెడ్డి తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.