వేములవాడ రాజన్న సన్నిధి లో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం…

Minister Ponnam in the presence of the King of Vemulawada

Advertisements

&NewLine;<p>తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర రవాణా&comma; బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్&comma; ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు&period; మంత్రి ఆలయంలోకి రాగానే ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు&period; పూజల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు&period; అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ&comma; తెలంగాణ ప్రజలకు భోగి&comma; మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు&period; రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడాలని&comma; రైతులు బాగుండాలని కోరారు&period; దేవుడిని కూడ ఈ దేశంలో రాజకీయాలు చేస్తున్నారని&comma; హిందూ సంస్కృతి ఉన్న వారు దేశాన్నీ గౌరవిస్తారని&comma; దేవుడిని సైతం కొందరు స్వంతం అని వ్యవహరిస్తున్నారని విమర్శించారు&period; 6 శాస్త్రాలు&comma; 18 పురాణాలు&comma; 12 ద్వాదశ లింగాలు&comma; 18 జ్యోతిర్లిలింగాలు&comma; నాలుగు వేదాలు&comma; నలుగురు జగద్గురు లు ఉన్న దేశంలో వాళ్ళ చేతుల మీదుగా రామాలయం ప్రారంభం చేయాల్సి ఉండగా&comma; రాజకీయాల కోసం దేవుడిని ఎన్నికల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు&period; పవిత్ర భారత దేశంలో రాజకీయాలను కూడ మార్కెటింగ్ చేస్తున్నారని&comma; మేము ప్రశ్నిస్తే మేము హిందువులకు వ్యతిరేకమని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు&period; హిందుత్వాన్ని విశ్వసించే వారు ఆలోచన చేయాలని&comma; దేవాలయ నిర్మాణం పూర్తి కాలేదని జగద్గురువులు చెబుతున్నారని&comma; దేవుడు కొందరి వాడు కాదు అందరి వాడని&comma; రాముడు&comma; శివుడు&comma; హన్మంతుడు మాకు లేడా అంటే మా పై రాజకీయం చేస్తున్నారన్నారు&period; దేశం లో మీ ప్రతిష్ట దిగజారుతున్న మీరు ఇంకా రాజకీయం చేస్తున్నారని&comma; పార్లమెంట్ లో ఆదాని&comma; అంబానీ గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని విమర్శించారు&period; శివరాత్రి కంటే ముందు రాజన్న ఆలయ అభివృద్ధి పై వీటిడీ ఏ మీటింగ్ ఏర్పాటు చేస్తామని&comma; ఎవరు ప్రశ్నించక ముందే వేములవాడ ఆలయ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.