106
చిత్తూరు జిల్లా నగరిలో మంత్రి రోజా.. APCC చీఫ్ షర్మిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పుకోవడం తప్ప.. షర్మిల ఆయన కోసం చేసిందేమీ లేదన్నారు. వైఎస్ఆర్ వారసుడు జగనన్న ఒక్కరే అని అన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి.. తాను తెలంగాణ బిడ్డనని.. ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెళ్లి చేసుకున్నాని చెప్పి.. పార్టీ మూసేశారన్నారు. వైఎస్ఆర్ ఆత్మ క్షోబించే విధంగా షర్మిల పనిచేస్తున్నారన్నారు. జగనన్న మాత్రం అందుకు భిన్నంగా పని చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ ఆశయాల కోసం పని చేస్తున్నది జగన్ మాత్రమేనని తెలిపారు మంత్రి రోజా. షర్మిల చంద్రబాబు వదిలిన బాణం అని ఎద్దేవా చేశారు.
మరిన్నితాజావార్తలకోసంఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.