టీడీపీ -జనసేన(TDP-JanaSena) అభ్యర్థుల ఉమ్మడి జాబితా:
టీడీపీ -జనసేన(TDP-JanaSena) అభ్యర్థుల ఉమ్మడి జాబితాను చూసి ఆ పార్టీల కార్యకర్తలు ఏడుస్తున్నారని మంత్రి రోజా సెటైర్ వేశారు. టీడీపీ – జనసేన ఉమ్మడి జాబితా చూశాక 175 స్థానాలు కొడతామన్న ధీమాతో వైసీపీ శ్రేణుల్లో డబుల్ అయిందన్నారు. అందుకే సంబరాలు జరుపు కుంటున్నామని తెలిపారు. పవర్ షేరింగ్, సీట్ షేరింగ్ అన్న పవన్ కళ్యాణ్… పావలా షేర్ సీట్లు కూడా తీసుకోలేదన్నారు మంత్రి రోజా. ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నారో ఆ పార్టీ కేడర్‌కు పవన్ కళ్యాణ్ చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.
ఇది చదవండి: చంద్రబాబు వద్ద పార్టీ అసంతృప్తి నేతల బుజ్జగింపులు.
24 సీట్లకే ఎందుకు తల వంచారో కూడా పవన్ జనసేన కార్యకర్తలకు చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో చంద్రబాబు చెప్పాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం పొత్తు అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. రాష్ట్రం విడిపోయాక చంద్రబాబుకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని రోజా విమర్శించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.