72
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుఫాను మిచౌంగ్. ప్రస్తుతానికి చెన్నైకి 170 కి.మీ, నెల్లూరుకు 20 కి.మీ, బాపట్లకు 150 కి.మీ, మచిలీపట్నానికి 210కి.మీ. దూరంలో తుఫాన్. మధ్యాహ్ననికి నెల్లూరు – మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్రతుఫానుగా తీరం దాటనున్న మిచౌంగ్. తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు. కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం. రేపు రాయలసీమల, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు నమోదైయ్యే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.