సిర్పూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అక్రమ వసూళ్లు, దందాలకు పాల్పడుతున్నారని దానికి మీ పేరు వాడుకుంటున్నారని మంత్రి సీతక్కకు సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు (MLA Harish Rao) ప్రెస్ మీట్ లో విన్నవించారు మంత్రి సీతక్కకు బహిరంగ లేఖ రాశారు. అక్రమాలకు కేరాఫ్ గా ఉన్న కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తన దో నెంబర్ దందాలను కొనసాగించడం, నిత్యాన్నదాన సత్రానికి ఫండ్ వసూలు చేయడం ప్రారంభించాడని ఆరోపించారు. అతని మేనల్లుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్ అన్ని విధాలా సహకరిస్తూ మీ పార్టీని అప్రతిష్టపాలు చేస్తున్నాడని లేఖలో వివరించారు. మామ, అల్లుళ్ళ ఆగడాలు అరికట్టాలని కోరారు సీతక్కను కోరారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి