82
భారత ప్రధాని నరేంద్ర మోడీ గోవాలో పర్యటిస్తున్నారు. దక్షిణ గోవాలోని బేతుల్ గ్రామంలో ఓఎన్జీసీ సీ సర్వైవల్ సెంటర్‌ను ప్రారంభించిన ప్రధాని ఆ తర్వాత ఇండియా ఎనర్జీ వీక్‌ను ప్రారంభంచారు. ఎనర్జీ వీక్ అనేది భారతదేశం యొక్క అతి పెద్ద ఓమ్నిచానెల్ ఎనర్జీ ఎగ్జిబిషన్. దీని ప్రారంభోత్సవానికి వివిధ దేశాల నుంచి దాదాపు 17 మంది ఇంధన మంత్రులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో 900 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 1,350 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేసారు. దీంతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌ను మోదీ జాతికి అంకితం చేసారు.