తిరుపతిలో మోడీ పర్యటన..

Naredra Modi

Advertisements

&NewLine;<p>రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటన సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 26 నవంబర్ మరియు 27 తేదీలలో తిరుపతి జిల్లా కు విచ్చేయనున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా&period; కే ఎస్ జవహర్ రెడ్డి డిజిపి రాజేంద్ర నాథ్ రెడ్డి తదితర రాష్ట్ర అధికారులతో తిరుపతి జిల్లా కలెక్టర్&comma; ఎస్పీ టీటీడీ ఈఓ తదితరులతో వర్చువల్ విధానంలో సమన్వయ సమావేశం నిర్వహించి సమీక్షించి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు&period; రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరావతి నుండి వర్చువల్ విధానంలో భారత ప్రధాన మంత్రి తిరుపతి జిల్లా పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించగా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి&comma; ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి&comma; జె&period;సి డి కె బాలాజీ&comma; జిల్లా రెవెన్యూ అధికారి హాజరయ్యారు&period; ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ భారత ప్రధాని తిరుపతి ఇంటర్నేషనల్ విమానాశ్రయం దగ్గర దిగినప్పటి నుండి తిరుగు ప్రయాణం వరకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని&comma; సంబంధిత అధికారుల సమన్వయ సమావేశం నిన్ననే నిర్వహించి విధులు కేటాయించామని తెలిపారు&period; ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్టు డాక్టర్లు ఏర్పాటు&comma; అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్&comma; 108&comma; సేఫ్ రూమ్&comma; తదితరాలు ఏర్పాటు&comma; అలాగే ఫైర్ సేఫ్టీ&comma; ఫుడ్ సేఫ్టీ&comma; విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ ఏర్పాటు&comma; తగినంత లైటింగ్ ఏర్పాటు&comma; రవాణా శాఖ వాహనాల ఫిట్నెస్ చెక్&comma; కమ్యూనికేషన్ ప్లాన్ ఇంటర్నెట్ టెలిఫోన్ సదుపాయాలు&comma; శానిటేషన్ ఏర్పాట్లు&comma; అవసరమైన చోట బ్యారికెడింగ్&comma; రోడ్డు మరమ్మత్తులు చేపట్టడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు&period; భారత ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి&comma; గవర్నర్ రానున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన ఏర్పాట్ల కొరకు అధికారులకు విధులు కేటాయించామని అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని తెలిపారు&period; టీటీడీ ఈఓ మాట్లాడుతూ భారత ప్రధాని తిరుమల చేరుకున్నపటి నుండి వారికి వారి సిబ్బందికి&comma; సిఎం&comma; గవర్నర్ గారికి వసతి&comma; ఆహారం&comma; దర్శనం అన్నీ ప్రణాళికా బద్ధంగా చేపడతామని అన్నారు&period; ఎస్పీ మాట్లాడుతూ తగినంత బందోబస్తుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..