బెదిరించి ఉద్యమాన్ని ఆపలేరు….

CITU district secretary G Venkateshwarlu

Advertisements

&NewLine;<p>అంగన్వాడి సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా మూడవ రోజు ఉలవపాడు ప్రాజెక్టు ఆఫీస్ వద్ద అంగన్వాడీల ఆందోళన జరిగింది&period; ఈ ఆందోళనకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేసింది&period; ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ&comma; రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది అంగన్వాడీలు నెలరోజుల ముందునుండి&comma; తమ సమస్యలు పరిష్కారం చేయాలని&comma; ప్రభుత్వానికి నోటీసు ఇస్తే పరిష్కారం చెయ్యకుండా&comma; మీరు సెంటర్లు తెరవకపోతే ఉద్యోగం నుండి తొలగిస్తామని బెదిరించడం సరైనది కాదని జి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని తప్పుపట్టారు&period; తెలంగాణ కన్నా అదనంగా వేతనం పెంచుతామని హామీ ఇచ్చారు కానీ&comma; ఇచ్చిన హమీ నెరవేర్చకుండా&comma; మాట తప్పిన ముఖ్యమంత్రిగా చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన అన్నారు&period;<br>కనీస వేతనం రూ 26 వేలు ఇవ్వా లని&comma; రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలుగా ఇవ్వాలని&comma; జీతంలో సగభాగం పెన్షన్ గా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు&period; ఈ కార్యక్రమంలో ఏ&period;పీ&period;అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్&lpar;సీఐటీయూ&rpar; ఉలవపాడు ప్రాజెక్టు అధ్యక్షురాలు సిహెచ్ ఇందిరావతి&comma; ఉలవపాడు మండల సీఐటీయూ అధ్యక్షులు వాకా లతారెడ్డీ&comma; గుడ్లూరు మండల అధ్యక్షులు ఎస్&period;కే పద్మజ&comma; లింగసముద్రము నేత కే&period;సుగుణ&comma; అంగన్వాడీ నాయకులు కత్తి బుజ్జమ్మ&comma; కృష్ణ కుమారి&comma; గీత&comma; పద్మజ&comma; అమిరున్నీసా&comma; పద్మ&comma; కామాక్షి తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.