ఘనంగా “గేదెల రాజు” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…

Advertisements

<p>రఘుకుంచే టైటిల్‌ పాత్ర పోషిస్తున్న చిత్రం &OpenCurlyQuote;గేదెలరాజు’&period; కాకినాడ తాలుకా సినిమా ట్యాగ్‌లైన్‌&period; రఘుకుంచే తో పాటు రామచంద్రం పుణ్యమూర్తుల&comma; వికాస్&comma; టీనా శ్వావ్య&comma; మౌనిక&comma; రవి చిన్నిబిల్లి తదితరులు నటించిన ఈ సినిమా టీజర్&comma; ట్రైలర్&comma; పాటలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే&period; ఈ చిత్రాన్ని మోటూరి టాకీస్‌ పతాకంపై రఘు కుంచె సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు&period; వాణి రవికుమార్‌ మోటూరి నిర్మిస్తున్నారు&period; ఈ సినిమా ఈ నెల 24à°¨ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది&period; ఈ రోజు హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఘనంగా నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శకులు వీ వీ వినాయక్&comma; వీఎన్ ఆదిత్య&comma; నిర్మాత&comma; రైటర్ కోన వెంకట్ పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ వీ వినాయక్ మాట్లాడుతూ &&num;8211&semi; రఘు కుంచె ఇండస్ట్రీలో అందరికీ మిత్రుడు&period; ఎంతోమంది స్నేహితులను సంపాదించుకున్నాడు&period; మా కన్నా ఇండస్ట్రీకి ముందు వచ్చాడు&period; ఆర్టిస్టుగా&comma; హీరోగా ప్రయత్నించాడు&period; మ్యుజీషియన్ గా &comma; సింగర్ గా పేరు తెచ్చుకున్నాడు&period; సోలో హీరోగా నటించాలనే ఆయన కల ఈ చిత్రంతో నెరవేరుతోంది&period; రిలీజ్ కు మంచి డేట్ దొరికింది&period; సినిమా నచ్చి మైత్రీ లాంటి సంస్థ రిలీజ్ చేయడమే ఈ సినిమాకు మొదటి విజయం&period; రఘు కుంచె క్యారెక్టర్ నే టైటిల్ గా పెట్టి ఎంతో ప్యాషనేట్ గా చేశారు&period; ఈ సినిమా విజయం సాధించి రఘుకు గొప్ప పేరు తీసుకురావాలని కోరుతున్నా&period; అలాగే దర్శకుడు చైతన్యకు సక్సెస్ దక్కి&comma; పెద్ద దర్శకుడు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>రైటర్&comma; ప్రొడ్యూసర్ కోన వెంకట్ మాట్లాడుతూ &&num;8211&semi; ఇంతమంది ఫ్రెండ్స్ ఉండటం రఘు కుంచె సంపాదించుకున్న ఆస్తి&period; ఆయన తన కొడుకును త్వరలో హీరోను చేయబోతున్నాడు&period; ఆ లోగా తను హీరోగా సినిమా చేసేశాడు&period; గేదెలరాజు సినిమా కంటెంట్ నేను చూశాను చాలా బాగుంది&period; ఈ రోజు స్టార్ హీరో కొత్త వాళ్లు అనే తేడా లేదు&period; కంటెంట్ బాగుంటే ఆ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది&period; కంటెంట్&comma; ప్యాషన్ తో రఘు ఈ సినిమా చేశారు&period; సినిమా తీసేందుకు డబ్బు కంటే ముఖ్యం కంటెంట్&comma; ప్యాషన్&period; అవి రెండు ఈ టీమ్ లో కనిపిస్తున్నాయి&period; ప్రతి టెక్నీషియన్ లో 24 క్రాఫ్టుల గురించి ఎంతోకొంత అభిరుచి&comma; అవగాహన ఉంటాయి&period; అలాంటి టెక్నీషియన్స్ అంతా తమ బెస్ట్ వర్క్ ఈ సినిమాకు ఇచ్చారు&period; సినిమాకు ఐపీఎల్ అని&comma; పైరసీ అని చాలా అడ్డంకులు ఉంటాయి&period; కానీ మంచి సినిమాను ఇవేమీ ఆపలేవు&period; మనం రిలీజ్ చేసే ట్రైలరో పాటో ఆడియెన్స్ నచ్చితే సినిమా చూస్తారు&period; మా బ్యాండ్ మేళం మూవీ ఇటీవల దీన్ని ప్రూవ్ చేసింది&period; గేదెలరాజు సినిమా కూడా మంచి విజయం సాధించి&comma; ఈ టీమ్ లోని వారికి ఇంటిపేరుగా మారాలని కోరుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>దర్శకుల సంఘం ప్రెసిడెంట్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ &&num;8211&semi; గేదెలరాజు సినిమా ట్రైలర్ నాకు బాగా నచ్చింది&period; రఘు కుంచె గారు మంచి నటుడు&period; ఆయన సినిమాలు సెన్సార్ లో చూసి ఫోన్ చేసే అభినందించేవాడిని&period; రఘు గారి మొహంలో అనేక ఎమోషన్స్ పలుకుతాయి&period; నటుడిగా ఆయన పెద్ద కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు&period; ఈ చిత్ర నిర్మాత వాణి గారు తన కొడుకు చైతన్యను డైరెక్టర్ ను చేయడం గొప్ప విషయం&period; సినిమా ఇండస్ట్రీకి వద్దనే తల్లిదండ్రులను చూస్తుంటాం&period; కానీ ఆమె తమ సొంత డబ్బులతో కొడుకును దర్శకుడిని చేశారు&period; ఈ సినిమా పరీక్షలు పూర్తయి హాలీడేస్ వచ్చిన మంచి టైమ్ లో రిలీజ్ అవుతోంది&period; మైత్రీ సంస్థ రిలీజ్ చేస్తోంది&period; ఈ సినిమా మంచి విజయం సాధించాలి&period; ఈ చిత్రంలోని పాత్రధారులు అందరికీ గుర్తింపు రావాలని కోరుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత రవికుమార్ మాట్లాడుతూ &&num;8211&semi; ఇండస్ట్రీలో పేరున్న పెద్దలతో కలిసి ఈ వేదిక పంచుకోవడం సంతోషంగా ఉంది&period; ఈ అవకాశం మా అబ్బాయి చైతన్య వల్లే మాకు కలిగింది&period; నా శ్రీమతి మా ఇంటికి మూలస్తంభం&period; ఆమె సపోర్ట్ తోనే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయగలిగాను&period; రఘు కుంచె గారు ఒక సోదరుడిలా మాకు సహకారం అందించారు&period; ఈ సినిమా మంచి విజయం సాధించి మాకు పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నాను&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>జర్నలిస్ట్ టీవీ5 మూర్తి మాట్లాడుతూ &&num;8211&semi; రఘు కుంచె నాకు మంచి మిత్రులు&period; ఆయనకు సినిమా అంటే చాలా ఇష్టం&period; రఘు బహుముఖ ప్రజ్ఞాశాలి&period; సంగీతం&comma; గానం&comma; నటన&period;&period;ఇలా ఎన్నో విభాగాల్లో ప్రతిభ కనబర్చారు&period; ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం రఘు కుంచెది&period; ఈ సినిమా సాంగ్స్&comma; ట్రైలర్ చూశాను&period; చాలా బాగున్నాయి&period; తన కలల్ని ప్రోత్సహించే పేరెంట్స్ ఉన్న దర్శకుడు చైతన్య అదృష్టవంతుడు&period; ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా&period; అన్నారు<&sol;p>&NewLine;<p>దర్శకుడు చైతన్య మోటూరి మాట్లాడుతూ &&num;8211&semi; గేదెలరాజు సినిమాతో కొత్త వాళ్లను&comma; నాకు తెలిసిన వాళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాను&period; మా మూవీ ఇంత పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ జరుపుకుని&comma; గ్రాండ్ రిలీజ్ కు వస్తుందని ఊహించలేదు&period; ఈ రోజు ఇంతమంది పెద్దలు మా సినిమాకు సపోర్ట్ చేసేందుకు అతిథులుగా రావడం సంతోషంగా ఉంది&period; నా లైఫ్ లో రఘు గారిని కలవడం పెద్ద అదృష్టంగా భావిస్తాను&period; ఆయన మా సినిమాకు ఎంత సపోర్ట్ చేశారో మా టీమ్ లోని ప్రతి ఒక్కరికీ తెలుసు&period; ఈ నెల 24à°¨ మీ ముందుకు వస్తున్నాం&period; మా గేదెలరాజు చిత్రాన్ని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాం&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటి శ్రావ్య మాట్లాడుతూ &&num;8211&semi; మా గేదెల రాజు సినిమాలో మాస్&comma; ఎమోషన్&comma; లవ్ వంటి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి&period; ఈ నెల 24à°¨ మీరంతా మా సినిమాకు వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు వికాస్ మాట్లాడుతూ &&num;8211&semi; ఈ చిత్రంలో నేను విజయ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను&period; ఈ పాత్రకు మంచి లవ్ స్టోరీ ఉంటుంది&period; గేదెలరాజు సినిమాకు మీరు ఇప్పటిదాకా చూడని ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్ కథను చూపించబోతోంది&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>యాక్టర్ రఘు కుంచె మాట్లాడుతూ &&num;8211&semi; కళారంగమైన సినిమా ఇండస్ట్రీకి తమ వారసులు వెళ్లాలని కోరుకునే తల్లిదండ్రులు చాలా తక్కుమంది ఉంటారు&period; ఎందుకంటే ఇక్కడ ఎవరికీ గ్యారెంటీ ఉండదు&period; ప్రతి శుక్రవారం జీవితాలు మారిపోతుంటాయి&period; పైకి ఎదిగినవాళ్లు కిందపడటం&comma; కిందనున్న వాళ్లు పైకి వెళ్లడం చూస్తుంటాం&period; మా డైరెక్టర్ చైతన్య పేరెంట్స్ మాత్రం అతన్ని చిత్ర పరిశ్రమకు తీసుకొచ్చారు&period; నేను చిన్నప్పుడు చదువుకున్న భగవద్గీత శ్లోకం ఒకటి బాగా గుర్తుంది&period; జీవితంలో ప్రతిరోజూ మనం కురుక్షేత్ర యుద్ధం చేయాల్సిందే&period; గెలిస్తే రాజభోగం ఓడిపోతే వీరస్వర్గం&period; ఈ రెండే ఉంటాయి&period; అలాగని మనం యుద్ధం చేయకుండా ఉండొద్దు&period; మన సినిమా ఇండస్ట్రీ పద్మవ్యూహం లాంటిది&period; ఇందులోకి రావడమే గానీ బయటకు వెళ్లడం ఉండదు&period; ఏది ఏమైనా ఇక్కడే ఉండి ప్రయత్నాలు చేస్తుంటాం&period; అలా సినిమా ఇండస్ట్రీ అనే పద్మవ్యూహంలోకి అభిమన్యుడిలా వచ్చిన దర్శకుడు మా చైతన్య మోటూరి గెలవాలని&comma; మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా&period; ఆయన తల్లిదండ్రులు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో&comma; ఎన్ని ఆశలు పెట్టుకున్నారో చెప్పాలంటే ఒక పుస్తకం రాయాలి&period; ఈ శుక్రవారం వారు కోరుకున్న ప్రతిఫలం దక్కాలని ఆశిస్తున్నా&period; మా సినిమా గురించి చెప్పాలంటే దాదాపు అందరం కొత్తవాళ్లమే&period; కొత్త వాళ్ల సినిమాలో చూసేందుకు ఏముందని మీరు అనుకోవచ్చు&period; ఈ మూవీలో ఒక మంచి కథ ఉంది&period; అది మన నేటివిటీ ఉన్న కథ&period; కాకినాడ అనే పట్టణంలో ఉండే ఒక రౌడీ&comma; అతని క్యారెక్టర్ చుట్టూ అల్లుకున్న కథ&period; గేదెలరాజు చుట్టూ ఉన్న అనేక కథలు ఆకట్టుకుంటాయి&period; సినిమా చివరి 20 నిమిషాల్లో అద్భుతమైన ట్విస్ట్ ఉంటుంది&period; మొదటి నుంచి సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఊహించని ట్విస్ట్ అది&period; ఆ ట్విస్ట్ కు వచ్చే సర్ ప్రైజింగ్ రియాక్షన్ సినిమాను కాపాడుతుందని నమ్ముతున్నాను&period; మైత్రీ సంస్థ వందకుపైగా స్క్రీన్స్ లో మా సినిమాను రిలీజ్ చేస్తోంది&period; ఎగ్జిబిటర్స్ మీ సినిమాను అడుగుతున్నారు అని మైత్రీ à°¶à°¶à°¿ గారు అనడం సంతోషాన్నిచ్చింది&period; మీరు సినిమా చూస్తే తప్పకుండా మరికొందరికి బాగుందని చెబుతారు&period; అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..