​శ్రీకాకుళంలో ‘సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్’ ఆగడాలు.

Advertisements

<p>శ్రీకాకుళం జిల్లాలో విద్యా వ్యాపారం పేరుతో జరుగుతున్న అక్రమాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి&period; జిల్లా హైవే పక్కన ఉన్న సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రస్తుతం వివాదాల కేంద్రంగా మారింది&period; బయటకు ఆకర్షణీయమైన భవనాలు&comma; ఏసీ క్లాస్‌రూమ్‌లు చూపిస్తూ తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్న యాజమాన్యం… లోపల మాత్రం నిబంధనలను పూర్తిగా గాలికొదిలేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి&period; విద్యాశాఖ అనుమతులు లేకపోవడం&comma; ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు రెన్యువల్ కాకపోవడం వంటి కీలక అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి&period; అయినప్పటికీ లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై భారీ భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తమవుతోంది&period; విద్యార్థుల భద్రత&comma; ఆరోగ్యం వంటి అంశాల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు&period; విద్యాబుద్ధులు నేర్పే ప్రదేశం ఇలా అక్రమాలకు వేదిక కావడం ఆందోళన కలిగిస్తోంది&period; ఈ పరిణామాలు జిల్లా విద్యా వ్యవస్థపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p>సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై వస్తున్న ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి&period; స్కూల్ బస్సులు హైవేపై రాంగ్ రూట్‌లో నడుస్తూ విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి&period; రోజంతా ఏసీ గదుల్లో ఉంచి&comma; ఆపై ఎండలో వ్యాయామం చేయించడం వల్ల పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని తల్లిదండ్రులు చెబుతున్నారు&period; స్కూల్ పక్కనే స్మశానం ఉండటం కూడా మరో వివాదానికి కారణమైంది&period; ఇన్ని సమస్యలు బయటపడుతున్నప్పటికీ… అధికారుల చర్యలు మాత్రం కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి&period; జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందిస్తామని చెప్పినా&comma; క్షేత్రస్థాయిలో మార్పు లేదని స్థానికులు అంటున్నారు&period; దీంతో అధికారులు యాజమాన్యం ఠీ కుమ్మక్కైయ్యారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి&period; ఇప్పటికైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని&comma; విద్యార్థుల భద్రతను నిర్ధారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..