వివేకా కూతురు సునీత(Sunita) తనపై కుట్రపూరితంగా బురద జల్లుతోందని కడప వైఎస్సార్సీపీ(Kadapa YSRCP) ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) మండిపడ్డారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల వేళ దురుద్దేశ పూర్వకంగా వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపానని దస్తగిరి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినా ఆయన్ను అప్రూవర్‌గా మార్చి కేసు నుంచి తప్పించారని, ఇతరులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ కేసులో దస్తగిరితో సునీత లాలూచీ పడ్డారని, తన ఎజెండా అమలు చేయడానికి దస్తగిరిని సునీత వాడుకుంటున్నారని అవినాష్ రెడ్డి విమర్శించారు. అందుకే దస్తగిరి బెయిల్‌కు సునీత అడ్డు చెప్పలేదని అన్నారు. సీబీఐ ముందు వాంగ్మూలం ఇచ్చిన సునీత ఆ తర్వాత లెటర్ గురించి తనకు తెలియదని తప్పించుకుందని తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: వైసీపీలో చేరిన చింతలపూడి బ్రదర్స్..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.