ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Advertisements

<p>దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పెంపు&comma; మహిళా రిజర్వేషన్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని&comma; అయితే ఇండియా కూటమి వీటికి వ్యతిరేకమని బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు&period; కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ అంశంలో తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తానంటే కుదరదని స్పష్టం చేశారు&period; డీలిమిటేషన్&comma; మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై చర్చ జరిగినప్పుడు&comma; కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తన అభిప్రాయాన్ని వెల్లడించారని చామల గుర్తు చేశారు&period; ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి&comma; అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని ఖర్గే సూచించారని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>2023లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని&comma; అయితే వీటి అమలుపై జరిగే చర్చల్లో అన్ని రాజకీయ పక్షాలను భాగస్వామ్యం చేయాలని ఎంపీ చామల డిమాండ్ చేశారు&period; ప్రస్తుతం ఉన్న 543 సీట్లకు మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు&period; కేవలం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు&period; ఇప్పటికే నిధుల పంపిణీ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;<p>సీట్ల పెంపుదల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక ప్రతిపాదన చేశారని చామల తెలిపారు&period; జనాభా ప్రాతిపదికన 50 శాతం&comma; రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధి ఆధారంగా మిగిలిన 50 శాతం సీట్లు పెంచాలని రేవంత్ సూచించారని&comma; దీనిపై ఇప్పటికే ఆయన ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు కూడా రాశారని పేర్కొన్నారు&period; కేంద్రం ప్రతిపాదించిన 850 సీట్ల పెంపుదలపై గందరగోళం నెలకొందని&comma; పార్లమెంట్‌లో బలం ఉందని ప్రతిపక్షాలను బుల్డోజ్ చేసే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు&period; 2026 జనగణనను పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనే విషయంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని&comma; కాంగ్రెస్ ఎన్నడూ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..