78
మాజీమంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సాధారణంగా ఎవరిని పిలవరు. ఈసారి తన నైజానికి విరుద్ధంగా జనవరి ఒకటో తేదీ నూతన సంవత్సర సందర్భంగా ప్రజలు తన ఇంటికి వచ్చి తన ఆత్మీయ విందు స్వీకరించాలని పిలుపునిచ్చారు. స్వయంగా ముద్రగడ పిలవడంతో పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు అందులో ఉన్నారు. ముద్రగడ వైసీపీలో చేరతారని ఆయన కుమారుడికి పత్తిపాడు సీటు వస్తుందని జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఆహ్వానం పలకడం విశేషంగా మారింది.