111
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ మొదలై 16 గంటలు పూర్తి్యుంది. కానీ ఇంకా మున్సిపాలిటీ అధికారులు జెండాలు, రాజకీయ నాయకుల పార్టీల ప్లెక్సీలు మెయిన్ రోడ్ లో దర్శనం ఇస్తున్న కానీ అధికారులు పట్టించుకోలేదు. ఎలక్షన్ కోడ్ వచ్చిన వెంటనే ఇవన్నీ తొలగించాలని ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేసినా కూడా రాజంపేట మున్సిపాలిటీలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు మున్సిపాలిటీ అధికారులు వ్యవహరిస్తున్నారు. పట్టణ ఎంట్రన్స్ లో నుండి మెయిన్ రోడ్డు.. ఆర్ఎస్ రోడ్డు.. చిట్వేల్ రోడ్ లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. వాటిని మున్సిపాలిటీ అధికారులు ఇంకా తొలగించకుండా చూస్తూనే ఉన్నారు. దీనిపై రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చూసి చూడనట్టు ఉండిపోతుంది.