చత్తీస్ ఘడ్ నారాయణపుర్ జిల్లాలో నక్సల్స్ ఘాతకం…

Narayanpur district of Chhattisgarh is a hotspot for Naxals

Advertisements

&NewLine;<p>ఛత్తీస్ గఢ్ నారాయణపూర్ జిల్లా నక్సల్స్ ఘాతుకం&comma; చోటే డోంగర్ గ్రామస్థుడిని నక్సలైట్లు గొడ్డలితో నరికి చంపారు&period; మృతుడు కోమల్ మంజ అని పోలీస్‌లు గుర్తించారు&period; చోటే డోంగర్ గ్రామంలో పేరు పొందిన నాటువైద్యుని మేనల్లుడు మంజ తన మేనమామతో కలిసి ఆలయంలో పూజలు చేసి ఇంటికి వస్తుండగా ఈ దాడి జరిగింది&period; వీరిద్దరికీ గతంలో చంపుతామని బెదిరింపులు కూడా వచ్చాయని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు&period; గత నెల అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన కొంతమందిని నారాయణ్‌పూర్ జిల్లా కేంద్రానికి తరలించి భద్రత కల్పించారని వారిలో వీరిద్దరు కూడా ఉన్నారని అన్నారు&period; రెండవ దశ పోలింగ్ పూర్తి అయిన తరువాత వీరిద్దరూ తమ గ్రామానికి తిరిగి వచ్చేశారు&period; తమకు ఇక రక్షణ అక్కరలేదని తిరస్కరించారని పోలీస్ అధికారి తెలిపారు&period; మంజ హత్య సంగతి తెలియగానే పోలీస్ బృందం ఆ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు&period; హత్య జరిగిన చోట మావోయిస్టుల చేతిరాత కాగితం దొరికింది&period; మంజ&comma; అందాయి ఘాటి ఇనుప ఖనిజం గని ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని&comma; భారీగా డబ్బు సంపాదిస్తున్నాడని నోట్‌లో రాసి ఉంది&period; మావోయిస్టుల కోసం ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..