నేటి నుంచి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు..

Advertisements

<p>ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి&period; ఈ నెల 30 వరకు ఐదు రోజుల పాటు జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు&period; యాదగిరిగుట్టలో జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టగా&period;&period;నేడు ఉదయం 8 గంటలకు పాతగుట్ట ఆలయంలో జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు&period; యాదగిరిగుట్ట&comma; పాతగుట్టతో పాటు అనుబంధ ఆలయమైన దబ్బగుంటపల్లిలోని యోగానంద నరసింహస్వామి టెంపుల్ లో జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఈఓ భవాని శంకర్ తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>యాదగిరిగుట్టలో తిరువేంకటపతి అలంకార సేవ&comma; నేడు కాళీయమర్దన అలంకార సేవ&comma; 28న గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకార సేవ&comma; 29న శ్రీరామావతార అలంకార సేవ&comma; 30న జరిగే నృసింహ అలంకార సేవ&comma; నృసింహ ఆవిర్భావంతో జయంతి ఉత్సవాలు పరిసమాప్తి కానున్నాయి&period; జయంతి ఉత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు స్వామివారి ఆర్జిత సేవలు&comma; నిత్య&comma; శాశ్వత&comma; మొక్కు కల్యాణాలు&comma; బ్రహ్మోత్సవం&comma; సుదర్శన నారసింహ హోమం పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు&period; జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే లక్ష్మీనరసింహస్వామి హవనం&period;&period;హోమం&comma; 26న చేపట్టే లక్ష కుంకుమార్చన&comma; 27న చేపట్టే లక్ష పుష్పార్చనలో పాల్గొనే భక్తుల కోసం ప్రత్యేక టికెట్లను ఆలయ అధికారులు అందుబాటులోకి తెచ్చారు&period; లక్ష్మీనరసింహస్వామి హవన పూజకు రూ&period;2 వేలు&comma; లక్ష కుంకుమార్చనకు రూ&period;2 వేలు&comma; లక్ష పుష్పార్చనకు రూ&period;2 వేలుగా టికెట్ ధరను నిర్ణయించారు&period; ఒక్క టికెట్ పై దంపతులిద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..