పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం కీలక నిర్ణయం.

పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం కీలక నిర్ణయం

Advertisements

<p>పెట్రోల్&comma; డీజిల్ అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే విషయం చెప్పింది&period; పెట్రోల్&comma; డీజిల్ అమ్మకాలపై అమల్లో ఉన్న తాత్కాలిక ఆంక్షలను జులై 1 నుంచి ఎత్తేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది&period; పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా హోర్మూజ్ జలసంధి క్లోజ్ అవడం&period;&period; ఇంధన సరఫరాకు ఆటంకాలు తలెత్తడం&period;&period; ఇలా పలు కారణాల వల్ల&period;&period; పారిశ్రామిక&comma; వాణిజ్య అవసరాలకు రిటైల్ ఇంధన కేంద్రాల నుంచి పెట్రోల్&comma; డీజిల్ బల్క్లో కొనే విషయంలో కొన్ని ఆంక్షలు విధించింది కేంద్రం&period; ఐతే పెట్రోలియం ఉత్పత్తుల ప్రస్తుత సరఫరా పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం&period;&period; ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ఆంక్షలు ఇకపై అవసరం లేదని నిర్ధారణకు వచ్చింది&period;<&sol;p>&NewLine;<p>ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ &lpar;IOCL&rpar;&comma; భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ &lpar;BPCL&rpar;&comma; హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ &lpar;HPCL&rpar; ద్వారా నిర్వహించబడే రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా పెట్రోల్&comma; డీజిల్ అమ్మకాలు&comma; పంపిణీని నియంత్రించేందుకు జూన్‌ 12à°¨ తాత్కాలిక ఆంక్షలు విధించింది&period; పెద్ద పెద్ద క్యాన్లు&comma; పీపాల్లో&period;&period; పెట్రోల్&comma; డీజిల్ కొట్టొద్దని&period;&period; వేల లీటర్లను పీపాల్లో నింపొద్దని&period;&period; అలాంటి వాళ్లకు పెట్రోల్&comma; డీజిల్ అమ్మొద్దని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అప్పట్లో కఠిన ఆదేశాలు జారీ చేసింది&period; రిటైల్ పెట్రోల్ బంకుల్లో బైక్స్&comma; కార్లు&comma; బస్సులు&comma; లారీలు&comma; ఆటోలు ఇలాంటి వాహనాల్లోనే పెట్రోల్&comma; డీజిల్ నింపాలని&period;&period; పీపాలు తీసుకొస్తే పోయొద్దని స్పష్టం చేసింది&period; బల్క్ కొనుగోళ్లపై నిషేధం 90 రోజులు అమల్లో ఉంటుందని ప్రకటించినప్పటికీ&period;&period; సరఫరాకు ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో ఈ ఆంక్షల నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది&period; జులై 1 నుంచి ఈ ఆంక్షలు ఎత్తివేయనున్నట్లు ప్రకటించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.