మిస్టర్ మోదీ… దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది..

మిస్టర్ మోదీ... దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది

Advertisements

<p>నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత&comma; లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు&period; 2024&comma; 2026 సంవత్సరాల పరిస్థితులను పోలుస్తూ ప్రభుత్వ వైఖరిపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు&period; పదేపదే పేపర్ లీక్‌లు జరుగుతున్నా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందని ఆరోపించారు&period;<br &sol;>&NewLine;నీట్ పరీక్ష పేపర్లు లీక్ అవుతున్నా విద్యా మంత్రి రాజీనామా చేయలేదని విమర్శించారు&period; మళ్లీ సీబీఐ విచారణ&comma; మరో కమిటీ ఏర్పాటవుతుందంటూ ఎద్దేవా చేశారు&period; ప్రధాని మోదీకి దేశం తరఫున కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నానని రాహుల్ పేర్కొన్నారు&period; మిస్టర్ మోదీ&comma; దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది&period; వాటికి సమాధానం చెప్పండి&&num;8230&semi; అంటూ మూడు సూటి ప్రశ్నలను లేవనెత్తారు&period;<br &sol;>&NewLine;పదేపదే పేపర్ లీక్‌లు ఎందుకు జరుగుతున్నాయి&quest;&comma; పేపర్ లీక్‌లపై చర్చ విషయంలో మీరెందుకు మౌనంగా ఉంటున్నారు&quest;&comma; పదేపదే విఫలమవుతున్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ఎందుకు పదవి నుంచి తొలగించడం లేదు&quest; సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు&period; వరుస పేపర్ లీక్‌à°² పట్ల కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి తగదంటూ ఆయన హితవు పలికారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..