అక్రమ వలసదారులకు బెంగాల్ సీఎం తీవ్ర హెచ్చరిక..

అక్రమ వలసదారులకు బెంగాల్ సీఎం తీవ్ర హెచ్చరిక

Advertisements

<p>పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులపై కొత్తగా ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది&period; ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి సువేందు అధికారి అక్రమ చొరబాటుదారులకు అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు&period; &OpenCurlyQuote;ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకముందే&period;&period; మీ అంతట మీరే ఇక్కడి నుంచి పారిపోండి’ అంటూ ఆయన స్పష్టం చేశారు&period; ప్రస్తుతం ఉన్న విదేశీయుల చట్టం లోబడే తాము ఈ చర్యలు తీసుకుంటున్నామని&comma; ఇందులో ఎలాంటి కొత్త చట్టం లేదని ఆయన పేర్కొన్నారు&period; ఈ అంశంపై ముఖ్యమంత్రి సువేందు అధికారి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు&period; &OpenCurlyQuote;తమ పౌరులను తిరిగి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని బంగ్లాదేశ్ ఇప్పటికే ప్రకటించింది&period; కాబట్టి ఇక్కడున్న అక్రమ వలసదారులు తక్షణమే ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలి&period; అక్రమంగా వచ్చిన వారిని జైళ్లలో పెట్టి బంధించవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు&period; వారిని జైల్లో ఉంచి భారతదేశ వనరులను&comma; ప్రజల సొమ్మును ఎందుకు వృధా చేయాలి&quest; ఈ చొరబాటుదారులు ఏమైనా మనకు అల్లుళ్లా&quest;’ అని సీఎం ఘాటుగా ప్రశ్నించారు&period; ఎవరైనా స్వచ్ఛందంగా వెళ్లకుంటే&comma; ప్రభుత్వం తదుపరి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు&period; ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేయడంతో వలసదారుల్లో వణుకు మొదలైంది&period; ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని హకీంపూర్ సరిహద్దు ప్రాంతంలో భారీగా అక్రమ వలసదారులు గుమిగూడారు&period; ప్రభుత్వం తనిఖీలను తీవ్రతరం చేయడంతో&comma; వారంతా తిరిగి బంగ్లాదేశ్ వెళ్ళిపోవడానికి అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది&period; గతంలో సర్ ప్రక్రియ సమయంలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..