తమిళనాడు సీఎం విజయ్‌ ప్రధాని మోదీతో భేటీ..

తమిళనాడు సీఎం విజయ్‌ ప్రధాని మోదీతో భేటీ

Advertisements

<p>తమిళనాడు సీఎం విజయ్‌ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు&period; తొలుత దిల్లీలోని తమిళనాడు భవన్‌కు చేరుకున్న విజయ్‌&period;&period; అనంతరం ప్రధాని కార్యాలయానికి వెళ్లి మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు&period; సీఎం అయ్యాక ఆయన తొలిసారి ప్రధానితో సమావేశమయ్యారు&period; దాదాపు 25 నిమిషాలపాటు సాగిన ఈ భేటీలో&period;&period; తమిళనాడుకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది&period; అనంతరం ఇరువురు నేతలు కలిసిన సందర్భంగా తీసిన ఫొటోలను పీఎంవో &OpenCurlyQuote;ఎక్స్‌’ వేదికగా పోస్టు చేసింది&period; ఇటీవల నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా &OpenCurlyQuote;అనైమంగళం’ రాగి శాసనాలను తిరిగి భారత్‌కు రప్పించడంలో ప్రధాని మోదీ చేసిన కృషికి సీఎం విజయ్‌ కృతజ్ఞతలు తెలిపారని పేర్కొంటూ తమిళనాడు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది&period; మేకెదాటు డ్యామ్‌ వివాదం అంశంపైనా ప్రధానితో చర్చించినట్లు పేర్కొంది&period; తమిళనాడు మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అరెస్టు చేయడం&comma; వేధించడం వంటి ఘటనలు పెరుగుతుండటంపై సీఎం ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది&period; ఈ ఏడాదిలోనే 12 అరెస్టులు నమోదయ్యాయని&comma; ప్రస్తుతం 58 మంది మత్స్యకారులు శ్రీలంక నిర్బంధంలో ఉన్నారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించింది&period; మత్స్యకారులను&comma; వారి పడవలను తక్షణమే విడుదల చేయాలని శ్రీలంక ప్రభుత్వాన్ని కోరాల్సిందిగా అభ్యర్థించినట్లు పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..