ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు..

ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

Advertisements

<p>దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో&comma; ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు&period; తీవ్రమైన వేడి పరిస్థితుల్లో పలు జాగ్రత్తలు సూచించారు&period; నిత్యం తగినంత నీరు తాగాలని అన్నారు&period; ఈ మేరకు సామాజిక మాధ్యమం &&num;8216&semi;ఎక్స్&&num;8217&semi; వేదిక ద్వారా ఆయన ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు&period; వీలైనంత వరకు మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లవద్దని సూచించారు&period;<br &sol;>&NewLine;అతి తీవ్రమైన వేడి నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవాలని అన్నారు&period; వృద్ధులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తెలిపారు&period; సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయాలని&comma; ఇళ్లు&comma; దుకాణాల వద్ద ఆరుబయట పక్షులు&comma; జంతువుల కోసం నీటిని ఉంచాలని కోరారు&period; ఎండ కారణంగా ఎవరికైనా ఏమైనా అయితే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు చేశారు&period; తల తిరగడం&comma; వికారం&comma; అలసట వంటి వడదెబ్బ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని కోరారు&period; చుట్టూ ఉన్నవారిలో ఎవరైనా అకస్మాత్తుగా సృహ కోల్పోయినట్లు అనిపించినా&comma; నీరసించినా వెంటనే వారిని నీడ ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్లాలని అన్నారు&period; ఇలాంటి సమయాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడుతామని పేర్కొన్నారు&period; అధిక ఉష్ణోగ్రతల ప్రభావం పిల్లలు&comma; వృద్ధులు&comma; రైతులు&comma; కార్మికులపై ఎక్కువగా ఉంటోందని అన్నారు&period; రాబోయే రోజుల్లో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది&period; విదర్భ&comma; ఛత్తీస్‌గఢ్&comma; ఉత్తరాఖండ్&comma; హర్యానా&comma; రాజస్థాన్&comma; బీహార్&comma; ఒడిశా&comma; తెలంగాణ&comma; కోస్తా&comma; ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి&period; మే 29 నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..