అత్తామామలు మౌనంగా ఉంటే వేధింపుల కేసు కుదరదు -సుప్రీం…

అత్తామామలు మౌనంగా ఉంటే వేధింపుల కేసు కుదరదు -సుప్రీం

Advertisements

<p>భార్యాభర్తల మధ్య జరిగే గొడవల్లో అత్తమామలు మౌనంగా ఉంటే వారిపై వరకట్న వేధింపుల కేసులు పెట్టలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది&period; నైతికంగా ఆ ప్రవర్తన తప్పు కావచ్చు కానీ&comma; దాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది&period; భర్త కుటుంబ సభ్యులందరినీ గుడ్డిగా కేసుల్లోకి లాగడం సరికాదని పేర్కొంది&period; జస్టిస్ సంజయ్ కరోల్&comma; జస్టిస్ ఎన్&period;కె&period; సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది&period; భర్తకు మద్దతు ఇచ్చారనో&comma; గొడవల్లో జోక్యం చేసుకోలేదనో లేదా సర్దుకుపోవాలని సలహా ఇచ్చారనో చెప్పి కుటుంబ సభ్యులపై క్రిమినల్ చట్టాలను ప్రయోగించలేమని కోర్టు స్పష్టం చేసింది&period; నేరంలో వారి ప్రత్యక్ష భాగస్వామ్యం లేదా నిర్దిష్టమైన పాత్ర ఉంటే తప్ప కేవలం సాధారణ ఆరోపణలతో అత్తమామలను దోషులుగా నిలబెట్టలేమని ధర్మాసనం వివరించింది&period;<&sol;p>&NewLine;<p>మధ్యప్రదేశ్‌లోని గుణా ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన భర్త&comma; అత్తమామలపై పెట్టిన వరకట్న వేధింపుల కేసును సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కొట్టివేసింది&period; సదరు మహిళ తన అత్తమామలపై ఎలాంటి నిర్దిష్టమైన ఆరోపణలు చేయలేదని కోర్టు గుర్తించింది&period; విఫలమైన వివాహ బంధంలో మహిళ పడే వేదనను తక్కువ చేసి చూడలేమని చెబుతూనే ఇలాంటి వైవాహిక వివాదాల కేసులను విచారించేటప్పుడు కింది కోర్టులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని&comma; ఆరోపణలను క్షుణ్నంగా పరిశీలించాలని సూచించింది&period; వైవాహిక వివాదాల్లో తీవ్రమైన భావోద్వేగాలు&comma; వ్యక్తిగత కక్షలు దాగి ఉంటాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది&period; ఇలాంటి సమయాల్లో కేవలం భర్తపైనే కాకుండా&comma; గొడవలతో ఎలాంటి సంబంధం లేని అతని కుటుంబ సభ్యులందరినీ కేసుల్లో ఇరికించే ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది&period; నిందితులుగా చేర్చిన వారు నిజంగానే క్రూరత్వానికి పాల్పడ్డారా&quest; లేదా&quest; అదనపు కట్నం కోసం వేధించారా అనేదానికి పక్కా ఆధారాలు ఉండటం చట్టప్రకారం ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..