అండమాన్‌ సముద్రంలో సహజ వాయువు నిక్షేపాలు.

అండమాన్‌ సముద్రంలో సహజ వాయువు నిక్షేపాలు

Advertisements

<p>అండమాన్‌ సముద్రంలో &OpenCurlyQuote;ఆయిల్‌ ఇండియా’ సంస్థ కొత్త సహజ వాయువు నిక్షేపాలను కనుగొంది&period; అండమాన్‌ జలాల్లోని శ్రీవిజయపురం-3 బావిలో ఈ నిక్షేపాలను గుర్తించినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీ్‌పసింగ్‌ పురి తెలిపారు&period; ఈ బావి అండమాన్‌ దీవులకు తూర్పు తీరాన 15 కిలోమీటర్ల దూరంలో&comma; 900 అడుగుల లోతులో ఉన్నట్లు వెల్లడించారు&period; ఇక్కడి బావిలో సహజ వాయువు ఉన్నట్లు నిర్ధారణ అయిందని&comma; ఆ గ్యాస్‌ మిశ్రమంలో ఏయే వాయువులు ఎంత శాతం ఉన్నాయన్నది తేల్చడానికి నమూనాలను ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు&period; అండమాన్‌ బేసిన్‌లో ఆయిల్‌ ఇండియా చేపట్టిన చమురు అన్వేషణలో ఇది రెండో విజయమన్నారు&period; భారతదేశం చమురు&comma; గ్యాస్‌ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం కోసం ఈ ఏడాది చివరికల్లా అండమాన్‌ రీజియన్‌లో మరిన్ని చమురు అన్వేషణ బావులను తవ్వాలని యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు&period; గత ఏడాది ఆయిల్‌ ఇండియాకు చెందిన శ్రీవిజయపురం-2 బావిలో గ్యాస్‌ను గుర్తించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.