కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్..
కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) నేడు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్(General Election Schedule) విడుదల చేసింది. 18వ లోక్ సభ ఎన్నికలతో పాటు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా వివిధ దశల్లో నిర్వహించేలా షెడ్యూల్(Schedule) ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలు 3 దశల్లో నిర్వహించనున్నారు. వీటిలో పలు రాష్ట్రాల్లోని 26 ఉప ఎన్నికలు కూడా ఉన్నాయి. లోక్ సభ ఎన్నికలు 7 దశల్లో జరగనుండగా, ఏప్రిల్ 19 నుంచి పోలింగ్ జరగనుంది. అన్ని అసెంబ్లీలు, ఉప ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న చేపట్టనున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections)..
ఏపీలో మే 13, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో మే 19న, ఒడిశాలో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు మే 13న, రెండో దశ ఎన్నికలు మే 20న నిర్వహించనున్నారు. ఏపీలో జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కానుండగా… ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన జరుపుతారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు గడువు విధించారు. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.
లోక్ సభ ఎన్నికలు(Lok Sabha elections)..
ఇక లోక్ సభ ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహిస్తున్నారు. 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే విడతలో లోక్ సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లో రెండు విడతల్లో లోక్ సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఛత్తీస్ గఢ్, అసోం రాష్ట్రాల్లో మూడు విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరపనున్నారు. ఒడిశా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో 4 విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్ లో 5 విడతల్లో… ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 7 విడతల్లో లోక్ సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో ప్రతి దశలోనూ కొన్ని లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.
పోలింగ్(polling) ఎప్పుడంటే…
తొలి దశ ఎన్నికలకు మార్చి 20న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతుంది. ఈ విడతలో 102 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. రెండో దశ ఎన్నికలకు మార్చి 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 26న పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో దశలో 89 లోక్ సభ స్థానాలకు పోలింగ్ చేపడతారు. మూడో దశ లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 12న విడుదల కానుంది. మే 7న పోలింగ్ జరుగనుంది. మూడో దశలో 94 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 13న పోలింగ్ నిర్వహిస్తారు. ఈ విడతలో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
నాలుగో దశలో 96 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఐదో విడత లోక్ సభ ఎన్నికలకు మే 20న పోలింగ్ జరగనుంది. ఐదో దశలో 49 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఆరో విడత లోక్ సభ ఎన్నికలకు ఏప్రిల్ 29న నోటిఫికేషన్ విడుదల కానుండగా, మే 25న పోలింగ్ జరగనుంది. ఆరో విడతలో 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఏడో విడత ఎన్నికలకు మే 7న నోటిఫికేషన్ విడుదల కానుండగా, జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి. చివరిదైన ఏడో విడతలో 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 17వ లోక్ సభ గడువు జూన్ 16తో ముగియనుండగా…. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీల గడువు జూన్ 2న, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16న, ఒడిశా అసెంబ్లీ గడువు జూన్ 24న ముగియనున్నాయి.
ఇది చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ లేఖ..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి