Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Politics టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు గెలవడం ఖాయం..

టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు గెలవడం ఖాయం..

by Rama
AP Politics

ఆంధ్రప్రదేశ్ (AP Politics):

వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రమంతటా కక్షపూరిత రాజకీయాలు, అనాలోచిత నిర్ణయాలతో విసుగెత్తిన రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటూ… రాష్ట్రమంతటా తెలుగుదేశం, జనసేన అనుకూల పవనాలు వీస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా స్థానిక పరిస్థితులను అనుసరించి వారి అభిప్రాయాలకూ అణుగుణంగా గెలుపుకురాళ్లకే టికెట్టు ఇవ్వాల్సిన జనసేన, టీడీపీ పార్టీలు తిరుపతిలో మాత్రం మొదటిలోనే తప్పటడుగు వేసింది. రాష్ట్రమంతా ప్రజలలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం జనసేన కూటమి విజయం ఖచ్చితంగా సాధిస్తుందని దీనికి తోడు బీజేపీ కూడా కలిసి రావడంతో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు గెలవడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాము లాంటిది..

అభ్యర్థుల ఎంపిక అనేది పార్టీల అధినేతలకు కత్తి మీద సాము లాంటిదే. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని ప్రదానంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించి వారికి అనుకూలంగా ఉన్న నేతలను బరిలోకి దించాల్సి ఉంటుంది. ఇందులో ఆర్థిక బలం, అంగ బలం, ప్రజా అభిమానం, పార్టీపై సానుకూలత, స్థానికత అనే అంశాలను పరిగణలోకి తీసుకొని ఆయా పార్టీ నేతలు బి ఫామ్ లు ఇస్తారు. అయితే తిరుపతిలో మాత్రం అందుకు రివర్స్ లో అభ్యర్థుల ఎంపిక జరిగిందని తిరుపతి వాసులు అంటున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో తిరుమల శ్రీవారి పాదాల చెంత విజయం సాధించిన అభ్యర్థి సెంటిమెంట్ గానే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడతారని నమ్మకం కూడా బలంగా ఉంది. తిరుపతి అసెంబ్లీ స్థానం నుండి మహామహులు పోటీకి దిగి విజయం సాధించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించినవారే. అందులో ఎన్టీ రామారావు, మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు ఉండడం గమనార్హం.

ఇంతటి కీలకమైన స్థానంలో ఇప్పుడు విజయం ఏ పార్టీలకైనా అత్యంత కీలకం.‌ తెలుగుదేశం, బిజెపి, జనసేన కలిసి కూటమిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించిన నేపథ్యంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థి ఎంపిక విషయంలో పూర్తిగా సరైన అంచనాకు రావడంలేదనే విషయం పార్టీ వర్గాలను కలవరపెడుతోంది. చిత్తూరు అసెంబ్లీ స్థానానికి తిరిగి టికెట్టు ఇవ్వలేదని ఆవేదనతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వదిలి జనసేనలో చేరిన ఆరని శ్రీనివాసులు కు తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని ప్రకటించడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగించడమే కాకుండా పార్టీ వర్గాలను సైతం ఆవేదనకు గురిచెస్తుంది.నిన్నటి వరకు వైసిపి లో ఎమ్మెల్యేగా ఉన్న ఆరని శ్రీనివాసులను చిత్తూరు నుండి తిరుపతికి తీసుకొచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం పై స్థానికులు అంగీకరించి ఓట్లు వేస్తారా ? అందుకు టిడిపి జనసేన నాయకులు సహకరించరు అంటూ గుసగుసలు వినపడుతున్నాయి.

అసలు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉన్న తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం లో 2019 లో జరిగిన ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి అత్యంత స్వల్పంగా 700 పైచిలుకు ఓట్లతో గెలిచారు. అయితే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు భూమన అభినయ రెడ్డిని తెరపైకి తెచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా భూమన అభినయ్ తిరుపతి అభివృద్ధిలో తన మార్కును చాటుకున్నారు. దాదాపు 40 సంవత్సరాలుగా లేని అభివృద్ధిని ఏడాది కాలంలోనే చేసి చూపించారు. మౌలిక వసతులు కల్పిస్తే కచ్చితంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావనతో భూమన అభినయ రెడ్డి తిరుపతిలో కనువిని ఎరుగనిరుగతో మాస్టర్ ప్లాన్ లో బాగంగా రోడ్లను అభివృద్ధి చేశారు.రాష్ట్రమంతటా వైసిపి వ్యతిరేక పవనాలు వీస్తున్నప్పటికీ తిరుపతిలో మాత్రం వైసీపీని, భూమన కుటుంబాన్ని ఓడించడం అంత ఈజీ కాదు అంటున్నారు రాజకీయ పండితులు.

తిరుపతిలో దాదాపు నాలుగు లక్షలకు పైగా ఉన్న ఓటర్లు లో 60 శాతం మందికి పైగా బలిజ కాపు సామాజిక వర్గాలకు సంబంధించిన వారు ఉండడం కారణంగా ఇక్కడి అభ్యర్థి గెలుపులో వారి ఓట్లే కీలకంగా పనిచేస్తాయి. ఈ కారణంగానే ఏ పార్టీ అయినా బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన వారిని అభ్యర్థిగా నిలబెట్టడానికి ప్రాధాన్యత ఇస్తాయి.‌ తెలుగుదేశం ఈ ప్లాన్ ను మొదటి నుంచి పాటిస్తుండగా అందుకు విరుద్ధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని నిలిపి విజయం సాధించడం ఓరకంగా సాహసమనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీలో ఆశావహులైన ఎం సుగుణమ్మ, ఊకా విజయ్ కుమార్, జేబీ శ్రీనివాస్, నరసింహ యాదవ్ తదితరులు ఎదురు చూశారు. అదేవిధంగా జనసేన పార్టీలో కీలకంగా ఉన్నటువంటి పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ లాంటి నాయకులే కాకుండా తాజాగా పార్టీలోకి చేరిన ఆరని శ్రీనివాసులు, గంట నరహరి తదితరులు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థులుగా పోటీపడ్డారు.

తిరుపతి పరిస్థితులు చంద్రబాబు నాయుడు బాగా తెలిసినప్పటికీ పొత్తులో భాగంగా సీటును జనసేనకు కేటాయించారు.దీంతో ఇంతకాలం తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీగా అవతరించిన నాటి నుండి తిరుపతిలో ఆ జెండా తోనే ఎన్నికల్లో నిలబడిన పరిస్థితులను పక్కనపెట్టి ఇప్పుడు తొలిసారిగా జనసేన జెండా ఎగిరేలా పరిస్థితి చూడాల్సి వచ్చింది. ఈ వాస్తవ రాజకీయ కోణాలు ఎన్ని ఉన్నప్పటికీ, తిరుపతి ప్రజలు మాత్రం ఒక రకమైన ఖచ్చితమైన అభిప్రాయంతోనే ఈసారి ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. వైసిపి ఎమ్మెల్యే అయిన ఆరని శ్రీనివాసులను జనసేనలో తీసుకున్న వెంటనే స్థానికేతరుడు అని కూడా చూడకుండా తిరుపతి జనసేన అభ్యర్థిగా ప్రకటించడం జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.ప్రజలు మాత్రం అన్ని పరిణామాల ను నిశితంగా పరిశీలిస్తున్నారు.

తిరుపతి బరిలో అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకోవాలంటే ఉమ్మడి తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీలకు ఒకటే మార్గం… కింది స్థాయి నుంచి వార్డుల స్థాయి వరకు ప్రతి గడప గడపకు తిరిగి బూత్ లెవలలో పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆర్థికంగాను బలపడి, ఏ పరిస్థితులు నైనా ఎదుర్కొని సామ దాన వేద దండోపాయాలలో విజయాన్ని సాధించాలనే పట్టుదలతో ఉన్న వైసిపి అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని ఎన్నికల్లో ఎదుర్కోవాలి అంటే… కచ్చితంగా జనసేన పార్టీ తరఫున అధినేత పవన్ కళ్యాణ్ నిలబడితే కచ్చితంగా విజయాన్ని సాధించ వచ్చు అనే అభిప్రాయం ఉంది. అలాకాకుండా జనసేనలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరు నిలబడినా గెలిచే అవకాశాలు ఏ మాత్రం లేవు.‌ కాదు అంటే తెలుగుదేశం పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు టికెట్ కేటాయించినా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలి అంటే తిరుపతిలో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ పనిచేస్తోంది.

జనసేనకు ఉన్న పార్టీ క్యాడర్ కూడా అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నాన్ లోకల్ గా అసంతృప్తి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆరని శ్రీనివాసులు తప్పించి నిలబడితే పవన్ కళ్యాణ్ నిలబడాలి.. లేదా సుగుణమ్మకు తెలుగుదేశం పార్టీ తరఫునైనా లేదా జనసేనలోకి ఆహ్వానించి ఆమెకే అసెంబ్లీ టికెట్ కేటాయిస్తే గెలుపు కు డోకా ఉండదని పార్టీ వర్గాలు ఇటు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరని శ్రీనివాస్ కు ప్రచారం చేసుకోమన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన గత రెండు రోజులుగా తిరుపతిలో స్థానిక ఆలయాలతో పాటు ప్రచారాన్ని కూడా ప్రారంభించేసారు. మరోవైపు టిడిపి జనసేన లోని కొంతమంది నాయకులు కార్యకర్తలు ఆరణి శ్రీనివాస్ కు వ్యతిరేకంగా గ్రూపులు కట్టారు. వీటన్నింటినీ అధిగమించి, అసమ్మతి నాయకులను బుజ్జగించి ఆరని శ్రీనివాస్ ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది మాత్రం వేచి చూడాలి.

ఇది చదవండి: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్..


జిందాల్ ప్లాంట్ నిర్వహణ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా..
జిందాల్ ప్లాంట్ ఏర్పాటు వ్యయం, నిర్వహణ తీరుపై ప్లాంట్ ప్రతినిధులను, అధికారులను రాష్ట్ర డిప్యూటీ సీఎం …
అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర-2026 నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. జూన్ 21వ తేదీ …
చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం…
అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019063
Total views : 89850

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.