సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కొంత విరామం తరువాత హీరోగా, సరికొత్తగా నవదీప్ గా 2.Oగా కనిపించబోతున్న చిత్రం లవ్,మౌళి. విభిన్నమైన, వైవిధ్యమైన ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో కలిసి నిర్మాణ పనులు టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ కి అడ్డాగా మారిన సి స్పేస్ భాధ్యతలు తీసుకుంది. ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ వినూత్నంగా అందరిని ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల మాస్ కాదాస్ విశ్వక్సేన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ట్రైలర్‌కు వస్తున్న స్పందన ఎంతో అద్బుతంగా వుంది. ఇటీవల ఇలాంటి వైవిధ్యమైన ట్రయిలర్‌ను చూడలేదని అందరూ కొనియాడుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కాగా మొదటిగా హైదరాబాద్ లో లవ్,మౌళి ట్రైలర్ ని లాంచ్ చేసి, అదేరోజు సాయంత్రం విశాఖపట్నం లొ సంగం ధియోటర్ ఇంటర్వెల్ లొ ప్రేక్షకులకి ట్రైలర్ ని స్క్రీనింగ్ చేసి వారితో సినిమా విశేషాలు పంచుకున్నారు, తరువాత రోజు పిఠాపురం వెళ్ళి దత్త పీటాన్ని దర్శించుకుని ఈ ఎలక్షన్స్ లో నిజాయితి గా వున్న వారిని గెలిపించండి.. నిజాయితిగా తీసిని సినిమా ని ఆదరించండి అంటూ అక్కడి ప్రజలకి తెలియజేశారు. అక్కడి నుంచి కాకినాడ ధియోటర్ పద్మప్రియా కి , రాజమండ్రి అనుశ్రీ దియోటర్స్ లో తన ట్రైలర్ తొ హంగామా చేశారు. తదనంతరం రాజమండ్రి లో ఫేమస్ అయిన రొజ్ మిల్స్ సెంటర్ లో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని కలిసి వారితో లవ్ మౌళి కబుర్లు చెప్పుకుంటూ వారితో కలిసి రొజ్ మిల్క్ ని తాగారు.. మూడవరోజు ఏలూరు ఎస్ వి సి మల్టిప్లెక్స్ లో ట్రైలర్ డైలాగ్స్ ని ప్రింట్ చేసిన టీషర్ట్ప్ పంచుతూ వారికి లవ్,మౌళి ట్రైలర్ చూపించి వారి అభిప్రాయాల్ని సేకరించారు.
అక్కడినుంచి గుంటూరు మైత్రి మూవీస్ వారి మల్టిప్లెక్స్ లొ హల్ చల్ చేశారు.. అక్కడి ప్రేక్షకుల కొరికతొ రెండు స్క్రీన్స్ లొ ట్రైలర్ ని ప్రదర్శంచారు. అక్కడి వారితో మాట్లాడుతూ ప్రేమ గురించి వివరించారు. చివరిగా విజయవాడ రాజ్ యువరాజ్ కాంప్లెక్స్ లో ట్రైలర్ ని ప్రదర్శించి మీడియా తొ మాట్లాడుతూ.. మొట్టమొదటి సారిగా మూడు రోజులు, ఏడు సిటీస్ లో ఎనిమిది స్క్రీన్స్ లో వేరోక సినిమా ఇంటర్వెల్ లొ మా ట్రైలర్ ప్రదర్శించి రియల్ సినిమా ఆడియన్స్ ని కలిసి ట్రైలర్ మీద వారి అభిప్రాయాలు తెలుసుకునాము. దీనికి కొపరేట్ చేసిన అందరికి దన్యవాదాలు తెలిపారు హీరో నవదీప్, ఈ టూర్ హీరో నవదీప్ తో పాటు హీరోయిన్స్ ఫంకూరి గిద్వాని, భావన మరియు ఈ చిత్రం లొని పాటలకి రచన అందించిన ఫేమస్ లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ గారు హజరయ్యారు.
నటీనటులు: నవదీప్, పంఖురి గిద్వానీ, భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు
బ్యానర్.. నైరా క్రియోషన్స్ అండ్ శ్రీకర స్టూడియోస్
నిర్మాణం .. సి స్పేస్
రచన -దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ : అవనీంద్ర
సంగీత దర్శకులు: గోవింద్ వసంత
పాటల రచన.. అనంత శ్రీరామ్
ఆర్ట్.. కిరణ్ మామిడి
పిఅర్ఓ : ఏలూరు శ్రీను- మధు మడూరి
- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్… భార్య స్నేహ రెడ్డి కి ధైర్యం చెప్పిన బన్నీ
- నయనతార, ధనుష్ మధ్యలో మనస్పర్దలకి కారణం ఏంటి …?
- అమరన్ శివకార్తికేయన్ తో జంటగా రష్మిక మందన్నా
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.