తెలంగాణలో సత్తా చాటిన కాంగ్రెస్. తెలంగాణలో ప్రజల పాలనకు పట్టం కట్టి దొరల పాలనకు మంగళం పాడారు అని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డిలు ఛాంపియన్ లుగా నిలిచి నాయకులను, కార్యకర్తలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ ను విజయ పదంలో నడిపించడం శుభపరిణామం అన్నారు.తెలంగాణలో దొరల అవినీతి కుటుంబ పాలనకు ప్రజలు విసిగి వేసారి ప్రగతి భవన్ కోటలు బీటలు వారేలా తీర్పునిచ్చారన్నారు.
కాంగ్రెస్ పార్టీ మాటల పార్టీ కాదని చేతల పార్టీ అని ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేస్తుందన్న పూర్తి నమ్మకం విశ్వాసంతో బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు.తెలంగాణలో నియంత, నిరంకుశ,కుటుంబ పాలనను అక్కడి ప్రజలు ఏ విధంగా తిరస్కరించారో అలాగే ఇతర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న నాయకుల అవినీతి అక్రమాలను ప్రజలు ఎంతో సహనంతో విజ్ఞతతో గమనిస్తున్నారని ఎన్నికల సమయంలో తమ ఓటు ద్వారా ప్రతాపం చూపిస్తారన్న విషయాన్ని అధికారంలో ఉన్న నాయకులు గమనించాలన్నారు.
అధికారం అశాశ్వతం మనం చేసే మంచి పనులు శాశ్వతం అన్న సత్యాన్ని గుర్తించాలని, అధికార దర్పంతో,అవినీతి సొమ్ముతో కుటుంబ పాలనతో విర్రవీగుతున్న నాయకులు తెలంగాణ ఎన్నికలను గుణపాఠంగా నేర్చుకోవాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ 9 వ తేదీ ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేసి ప్రజల ఆశీస్సులతో పేద బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రజారంజకమైన సుపరిపాలనను అందిస్తుందన్నారు.
దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ నిన్న కర్ణాటకలో నేడు తెలంగాణలో ఇప్పటికే తమిళనాడులో మిత్రపక్షంగా ప్రజల మన్ననలను పొందుతూ త్వరలో దక్షిణ భారతదేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటుందన్న దీమాను వ్యక్తం చేశారు.
తెలంగాణ ఎన్నికల్లో ఆదరించిన ప్రజలకు గెలిచిన అభ్యర్థులకు సహకరించిన కార్యకర్తలకు వెన్నంటే ఉండి ప్రోత్సహించిన హై కమాండ్ పెద్దలకు నవీన్ అభినందనలు తెలియజేశారు.
కాంగ్రెస్ మాటల పార్టీ కాదు, చేతల పార్టీ – నవీన్ కుమార్ రెడ్డి
70