భారత నౌకా దళ శక్తి సామర్థ్యాలను మరింత పెంపొందించేలా నేవీ చేతికి సరికొత్త డ్రోన్ అందుబాటులోకి వచ్చింది. సముద్రంలో నిఘా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన దృష్టి డ్రోన్ ను చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ ఆవిష్కరించారు. నౌకాదళ అవసరాలకు అనుగుణంగా ఈ మానవరహిత వైమానిక వాహనాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించామని వివరించారు. ఈ డ్రోన్ తో నౌకాదళ నిఘా సామర్థ్యం మరింత పెరుగుతుందని అడ్మిరల్ హరికుమార్ తెలిపారు. హైదరాబాద్ లోని అదానీ ఎరోస్పేస్ పార్క్ లో ఆయన మాట్లాడుతూ ఇంటెలిజెన్స్, నిఘా, గూఢచర్య కార్యకలాపాలలో దేశ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. సముద్ర జలాల్లో భారత ఆధిపత్యం కొనసాగేందుకు తాజా ఆవిష్కరణ తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఐఎస్ఆర్ టెక్నాలజీలో స్వయం సమృద్ధి దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందన్నారు. దృష్టి డ్రోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే ఏకధాటిగా 36 గంటల పాటు గాలిలోనే ఉంటూ నిఘా పెట్టగల సామర్థ్యం దీని సొంతం. దీంతోపాటు 450 కిలోల వరకు పేలోడ్ ను మోసుకెళ్లేలా ఈ డ్రోన్ ను డిజైన్ చేసినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. సముద్ర జలాలపై వాతావరణ మార్పులను తట్టుకుంటూ, ఎలాంటి వాతావరణంలోనైనా గాల్లోకి లేచేలా ఈ డ్రోన్ ను తయారు చేసినట్లు తెలిపింది.
నేవీ చేతికి సరికొత్త డ్రోన్..!
67
previous post