Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home TelanganaRangareddy చాక్లెట్లు తిని మత్తులో విద్యార్థులు వింత ప్రవర్తన

చాక్లెట్లు తిని మత్తులో విద్యార్థులు వింత ప్రవర్తన

by Rama
Ganjayi Chocolate

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. షాద్ నగర్ నియోజవర్గం కొత్తూరు మండలంలో గంజాయి చాక్లెట్ల విక్రయం కలక‌లం సృష్టిస్తుంది. కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రవర్తనలో మార్పు కనిపించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంగోర్ నాయక్ జిల్లా విద్యాశాఖ అధికారికి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఘా పెట్టిన ఎస్ఓటి పోలిసులకు కొత్తూరులోని కిరాణా షాపుల డబ్బాలలో గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి, పూర్తి సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో చార్మినార్ గోల్డ్ పేరిట పసుపు, బంగారు వర్ణంలో గల సుమారు 8 కేజీల గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు పట్టుపడ్డాయి. చాక్లెట్లను విక్రయిస్తున్న ఒడిస్సా రాష్టానికి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకీ తీసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. గంజాయి చాక్లెట్ల విక్రయ వ్యవహారంలో కొత్తూరు ఇన్స్పెక్టర్ నర్సింహా రావును వివరణ కోరగా గంజాయి చాక్లెట్ల వ్యవహారం నిజమేనని, కేసును దర్యాప్తు చేస్తున్నట్లు, కేసును పూర్తి స్థాయిలో దర్యాఫ్తు చేసిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

013871
Total views : 78244

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.