మాల్దీవుల పర్యాటకం పై ప్రతికూల ప్రభావం…

Negative impact on Maldives tourism

Advertisements

&NewLine;<p>భారత్‌తో దౌత్య వివాదం మాల్దీవుల పర్యాటకంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ముహమ్మద్ నషీద్ ఆందోళన వ్యక్తం చేశారు&period; ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న ఆయన భారత్‌కు తమ దేశ ప్రజల తరపున క్షమాపణలు కూడా చెప్పారు&period; మాల్దీవుల పర్యాటకాన్ని బాయ్‌కాట్ చేయాలన్న పిలుపు ఆందోళనకరమని వ్యాఖ్యానించారు&period; ఈ దౌత్య వివాదం మాల్దీవుల పర్యాటకంపై చాలా ప్రతికూల ప్రభావం పడింది&period; ఈ విషయంలో నేను చాలా ఆందోళనతో ఉన్నా&period; పరిస్థితులు ఇలాంటి మలుపు తీసుకున్నందుకు మాల్దీవుల ప్రజలు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు&period; భారతీయులు మా దేశంలో పర్యటించాలని కోరుకుంటున్నాం&period; మా ఆతిథ్యంలో ఎటువంటి మార్పు ఉండదు అని నషీద్ తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మాల్దీవులతో భారత్‌ ఎప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరించిందని నషీద్ తెలిపారు&period; భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని తమ దేశం పట్టుబడుతున్నా భారత్ తమను బలవంతం పెట్టలేదని చెప్పుకొచ్చారు&period; చర్చల ప్రతిపాదనతో హుందాగా వ్యవహరించిందన్నారు&period; చైనాకు దగ్గరవుతున్న మాల్దీవులు దశాబ్దాలుగా భారత్‌తో ఉన్న సంబంధాలను పక్కకు పెడుతున్నారు&period; మాల్దీవుల అధ్యక్షులు అధికారం చేపట్టాక తొలి విదేశీ పర్యటనపై భారత్‌కు రావడం ఆనవాయితీగా వస్తుండగా ప్రస్తుత అధ్యక్షుడు ముయిజ్జు మాత్రం ఈ సంప్రదాయానికి తెరదించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.