ఇప్పుడు YouTube ప్రీమియం సభ్యులు ఎటువంటి డౌన్లోడ్లు లేకుండానే యూట్యూబ్ లో గేమ్‌లను ఆడొచ్చని కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్, iOS, వెబ్‌లో యూట్యూబ్ యాప్‌లో ప్లే చేయగల 30కి పైగా ఆర్కేడ్ గేమ్‌ల కొత్త సేకరణను ప్లాట్‌ఫారమ్ ‘ప్లేబుల్స్’ను విడుదల చేసింది. YouTube Premium సభ్యులు గత వారంలో యాప్‌లోని కొత్త ఫీచర్ల కోసం నోటిఫికేషన్‌ను అందుకున్నారు. చెల్లించే సబ్స్క్రైబర్లు ఇప్పుడు ప్లాట్‌ఫారమ్‌లో ప్లేబుల్స్ని ఎనేబుల్ చేసే ఆప్షన్‌ను ఉంటుంది. వాటిని డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా తక్షణమే గేమ్‌లను ఆడటం స్టార్ట్ చేయవచ్చు. ఆండ్రాయిడ్లేదా ఐఓఎస్ లో లేదా వెబ్‌లో YouTube వెబ్‌సైట్‌కి వెళ్లండి. హోమ్‌పేజీలో క్రిందికి స్క్రోల్ చేయడం ద్వారా ప్లేయబుల్స్ షెల్ఫ్‌ను వినియోగదారులు కనుగొనవచ్చు. దిగువ కుడివైపున ఉన్న మీ ప్రొఫైల్ చిహ్నాన్ని నొక్కి, మీ ప్రీమియం ప్రయోజనాలు కిందికి స్క్రోల్ చేసి ఆపై ప్రయోగాత్మక కొత్త ఫీచర్లను ప్రయత్నించవచ్చు. ప్లేబుల్స్ లో ప్రస్తుతం 37 గేమ్‌లు ఉన్నాయి. ఇందులో యాంగ్రీ బర్డ్స్ షోడౌన్, కానన్ బాల్స్ 3D వంటి యాక్షన్ గేమ్‌లు, డైలీ క్రాస్‌వర్డ్, బ్రెయిన్ అవుట్ వంటి పజిల్ టైటిల్లు, డైలీ సాలిటైర్, జిన్ రమ్మీ వంటి కార్డ్ గేమ్‌లు ఉన్నాయి. ప్లేయబుల్స్తో పాటు, ప్రీమియం సబ్స్క్రైబర్ల కోసం కొత్త ప్రయోగాత్మక ఫీచర్లలో భాగంగా యూట్యూబ్ ఏఐ-ఆధారిత ఫీచర్ ను తీసుకొచ్చింది. యూట్యూబ్ 1080p వీడియోలపై దాని మెరుగైన బిట్రేట్ ఆఫర్‌ను ప్రీమియం వినియోగదారులకు అందిస్తోంది. మొదట్లో iOSలో మాత్రమే ప్రవేశపెట్టబడిన ఈ ఫీచర్ ఇప్పుడు Android పరికరాలు, స్మార్ట్ టీవీలలో అందుబాటులో ఉంది.
యూట్యూబ్‌లో కొత్త ఫీచర్..!
60
previous post