డిసెంబర్ 1 నుండి New SIM Card Rules అమలులోకి తీసుకు వస్తోంది. కొత్త రూల్స్ అమలు కావడానికి కేవలం ఒక రోజు మాత్రమే గడువు భారత ప్రభుత్వం డిసెంబర్ 1 నుండి కొత్త సిమ్ కార్డ్ అమలులోకి తీసుకు వస్తోంది. ఈ కొత్త రూల్స్ ను ఫాలో చేయ్యని వారికి 10 లక్షలు ఫైన్ ను కూడా విదిస్తుంది. అంటే, కొత్త రూల్స్ అమలు కావడానికి కేవలం ఒక రోజు మాత్రమే గడువు వుంది. అందుకే, మొబైల్ యూజర్లు, ప్రభుత్వం అమలు చేయనున్న ఈ కొత్త సిమ్ కార్డ్ రూల్స్ ను గతంలో సిమ్ కార్డ్ తీసుకోవడం చాలా సులభమైన పద్డతి. అయితే, సిమ్ కార్డ్ లను ఎటువంటి పారదర్శకత లేకుండా అడ్డగోలుగా అమ్ముడు చేశారు కొంత మంది సిమ్ కార్డ్ విక్రయదారులు. అయితే, సిమ్ కార్డు యూజర్ వెరిఫికేషన్ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ను ఉపయోగించిన తరువాత చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాపంగా ఒకే ఫోటో మరియు వివరాలతో వేలల్లో సిమ్ కార్డ్ లను లోకల్ సిమ్ కార్డ్ విక్రయదారులు విక్రయించి నట్లు బయటపడింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ కొత్త సిమ్ కార్డ్ రూల్స్ ను తీసుకు వచ్చింది. వాస్తవానికి, 2023 అక్టోబర్ 1 నుండే అమలులోకి రావాల్సి ఉండగా, ప్రభుత్వం కొత్త సిమ్ కార్డ్ రూల్స్ కోసం రెండు నెలల గడువును విధించింది. ఈ రోజుతో గడువు ముగుస్తుంది మరియు డిసెంబర్ 1 నుండి కొత్త రూల్స్ అమలవుతాయి. ఏమిటి ఈ సిమ్ కార్డ్ రూల్స్? ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త సిమ్ రూల్స్ ప్రకారం, సిమ్ విక్రయదారులు అందరూ కూడా వారి పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయించు కోవాల్సి ఉంటుంది. అంతేకాదు, ఈ రిజిస్ట్రేషన్ కోసం వారి వివరాలను మరియు ఐడెంటిటీని పోలీసులు కూడా నిర్ధారించ వలసి ఉంటుంది. ఆ తరువాతే ఆ విక్రయదారులు పూర్తి వెరిఫికేషన్ భాద్యత అంతా కూడా ఆ టెలికం ఆపరేటర్ దే అవుతుంది. ఈ వెరిఫికేషన్ మరియు రిజిస్ట్రేషన్ ప్రోసెస్ మొత్తం కూడా ఈ రోజు లోపుగా పూర్తి చేయవలసి ఉంటుంది. డిసెంబర్ 1 నాటికి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయని విక్రయదారులకు 10 లక్షల వరకూ జరిమానాను విదిస్తుంది DoT.
డిసెంబర్ 1 నుండి New SIM Card Rules మొదలు..ఫాలో అవ్వకపోతే 10 లక్షలు ఫైన్.!
76
previous post