Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh దొంగే దొంగ అన్న చందంగా….

దొంగే దొంగ అన్న చందంగా….

by Prakash
Achchennaidu

దొంగ ఓట్లపై టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, బోండా ఉమా, తదితరులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ వైఖరి దొంగే దొంగ అన్న చందంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థను చేతుల్లో పెట్టుకొని ఓడిపోతామని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఏపీలో 8 జిల్లాల కలెక్టర్‌లు వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని.. వారిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫార్మ్ 6, 7, 8 డుప్లికేట్‌లపై తాము పెట్టిన అప్లికేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ.. రాష్ర్టంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. పదో తారీఖు లోపు ఢిల్లీ నుండి ఒక టీమ్ రాబోతుందన్నారు. 8 మంది జిల్లా కలెక్టర్లపై ఈసీకి ఫిర్యాదు చేయబోతున్నామన్నారు. కలెక్టర్లు జగన్ కనుసన్నల్లో కాకుండా.. ఎన్నికల నిభందనలను పాటించాలని తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

014083
Total views : 78929

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.